మానవ జన్మ.! ( వైకుంఠపాళీ -కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)

'భోగేన పుణ్యం కుశలేన పాపం'
అన్న చందాన కుశలబుద్ధితో పాముల్ని దాటుకుని,
సుగుణాత్మకాలైన నిచ్చెనలను ఎక్కి
పరమసుఖాన్ని భోగించడమే జీవుల జీవనోద్దేశ్యం.
.
“మాతా చ కమలాదేవీ పితా దేవో జనార్దనః।

బాంధవా విష్ణుభక్తా చ నివాసం భువనత్రయం॥“

'

మానవ జన్మ.!
( వైకుంఠపాళీ -కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)
వర్షపు చినుకు ద్వారా భూమికి చేరిన జీవి,
తండ్రి గర్భంలో మూడు నెలలు ఉండి, రేతస్సు ద్వారా తల్లి గర్భంలోకి ప్రవేశించి, అక్కడ తొమ్మిది నెలలు ఉండి ప్రసూతి వాయు తాడనం చే భూమి పైకి రావడం జరుగుతుంది.
ప్రాణమున్నంత వరకూ ఈ దేహాన్ని శరీరమని పిలుస్తారు.
‘శీర్యతేతి శరీరం’. శీర్య మంటే రోగాది ఉపద్రవాలని అర్థం. నానా విధాలైన దైహిక, మానసిక రుగ్మతలతో హింసపడే దేహాన్ని శరీరమంటారు. త్రిగుణాత్మకమైన ఈ శరీరంలో సాత్వికగుణం వల్ల దయ, క్షమ, శాంతి మొదలైనవి పుడతాయి. రజోగుణం వల్ల అనేక కర్మలను చేయడానికి బుద్ధి పుడుతుంది.
తమోగుణం వల్ల కామ, క్రోధ, లోభ, మోహాది దుర్గుణాలు పుడతాయి.

నుదుటిన వ్రాసిన విధంగా జీవించి ప్రాణవాయువు తొలగగానే శరీరం కాస్తా శవమౌతుంది. యోగ్యులైన, యోగులైనా, అయోగ్యులైనా, చనిపోయిన వారి దేహాన్ని శవమనే పిలుస్తారు.
'శం సుఖం వహతీతి గచ్ఛతీతిశవం'. యోగులు, యోగ్యుల విషయంలో 'శవం' అన్నది సుఖాన్ని కొనిపోయేదిగా ఉంటుంది. అయోగ్యుల విషయంలో సంకటభూయిష్టమై, దుర్గంధభరితమై, జంతువుల కాహారమయ్యే పాంచభౌతిక దేహంగానే మిగిలిపోతుంది.
నేడు ఉండి మరునాడు శిథిలమైపోయే ఈ శరీరాన్ని దేవాలయంగా మార్చగలగడమే సాధన.

...

 Human life.!
(Vaikunthapali -poet satyanarayana Samrat Shri Vishwanatha.)
Chinuku being joined to the ground by rain,
The father of three months in the womb and sperm into the mother's womb, there are nine months to come up with the labor is done by air bombardment.
The body is to pranamunnanta body.
"Siryateti body '. Sirya means inflammation of the grievance rogadi. Nana systemic forms, mental health hinsapade flesh body. The body of trigunatmakamaina satvikagunam mercy, forgiveness, peace, etc. are born. Rajoguna arises in the mind of many acts.
Tamogunam the Kama, rage, lobha, mohadi vices arise.
Nudutina removal of the body's oxygen deficit savamautundi way to survive. Promising, yogulaina, ayogyulaina, the body of the deceased is savamane.
"Sham palace vahatiti gacchatitisavam '. Yogis, worthy of the 'corpse' is a pleasure to be konipoyediga. In the case of unworthy sankatabhuyistamai, durgandhabharitamai, kaharamayye pancabhautika animals are left to the body.
Marcagalagadame the body as a temple and collapsed the next day to practice today.



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!