శుభోదయం.! శ్ర్రీ నాధుని కాశి నగర సూర్యోదయం . !

శుభోదయం.!
శ్ర్రీ నాధుని కాశి నగర సూర్యోదయం .
‘’ప్రధమ సంధ్యాంగానా ఫాల భాగమున –జెలువారు సింధూర తిలక మనగ గైసేసి పురుహూతు గారాపు టిల్లాలు-పట్టిన రత్న దర్పణ మనంగ నుదయాచాలలేంద్రంబు తుద బల్లవిం చిన –మంజు కంకేళి నికుంజ మనగ
 శత మాన్యు శుద్ధాంత సౌధ కూటము మీద –గనువట్టు కాంచన కలశమనగ
 గాల మనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి –కుతుక మొప్పగా
నుమిసిన ఘటిక యనగ గగన మందిర దీపికా కళిక యనగ
 –భానుడుదయించే దేదీప్య మాను డగుచు ‘’

.
 భావం –
ప్రాతః కాల సంధ్య అనే స్త్రీ నుదుటి మీద సింధూరం బొట్టు లాగా ,బాగా అలంకరించుకొన్న ఇంద్రపత్ని శచీదేవి చేతిలో ఉన్న అద్దం లాగా ,
 తూర్పు కొండ పై చిగిర్చిన అశోక వృక్షపు పొదరిల్లు లాగా ,
ఇంద్రుడి మేడపై ఉన్న బంగారు కలశం లాగా ,కాలం అనే సిద్ధుడు మింగి ఉమ్మేసిన మాత్ర లాగా , .
ఆకాశ మందిరం లో ప్రకాశించే దీప కాంతి లాగా సూర్యుడు ఉదయించాడు .


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!