_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(24 /6/15.)

_శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(24 /6/15.)
.
తరగల్, పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపయ: పిండముల్
సిరులందేల మదాంధు లౌదురో జనుల్ శ్రీ కళహస్తీశ్వరా!
.
శంకరా! సంపదలు, నీటికెరటాలలాగా, రావిఆకులలాగా, మెరుపుటద్దాలలాగా,
గాలిలోని దీపాలలాగా, ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా, మిణుగురుపురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా,
వెన్నెల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా!
మనుషులు అటువంటి సంపదలతో గర్వించి తిరుగుతారేమి?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!