శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(13 / 6 /15.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(13 / 6 /15.)
.
దివిక్ష్మారుహ ధేనురత్న ఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
నువు నీ విల్లు ,నిధీశ్వరుండు సఖుఁడర్ణోరాశి కన్యావిభుం
డు విశేషార్చకుఁడింక నీకెన ఘనుండున్ గల్గునే ? నీవు చూ
చి విచారింపవు లేమి నెవ్వడుఁడుపున్ ? శ్రీ కాళహస్తీశ్వరా !
.
ఓ కాళహస్తీశ్వరా !
కోరికలను తీర్చు కల్పవృక్షము , కామధేనువు , చింతామణి వంటి సంపదలతో ప్రకాశించు మేరుపర్వతము నీ ధనుస్సు. కుబేరుడు నీకు స్నేహితుడు .
లక్ష్మీదేవి భర్తయైన శ్రీ మహా విష్ణువు నీకు విశేష భక్తుడు.
నీ సాటి దైవము లేడు కాని నీవు మాత్రం దారిద్ర్యంలో మునిగిన
మా బాధలను పోగొట్టడానికి యత్నించడం లేదు .
నీవు కాక మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ప్రభూ !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!