శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(11 / 6 /15.)

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(11 / 6 /15.)

.
భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముడై వీడు న
న్ను వివేకింపడటంచు , నేను నరకార్ణోరాశిపాలైన బ
ట్టవు , బాలుండొక చోట నాటతమితోడ న్నూతగూలంగ దం
డ్రి విచారింపక యుండునా ? కటకటా ! శ్రీ కాళహస్తీశ్వరా !
.
.
ఓ శంకరా !
సంసారమనే మద్యపానపు మత్తులో ఈ మానవుడు
పాపాత్ముడై నన్ను తలంచడం లేదనే ఊహ తో నీవు
నేను నరకమనే సముద్రంలో పడిపోయినా పట్టనట్లు ఊరుకుంటున్నావు .
కొడుకు ఆడుకుంటూ నూతిలో పడిపోతే తండ్రి పట్టించుకోకుండా ఊరుకుంటాడా ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!