జగన్మోహిని !

జగన్మోహిని !

_

పాక శాసనునకుఁ బరిహాస వచనంబు కాలకేయునకు శృంగారలీల,

వైవస్వతునకు భ్రూ వల్లరీ నటనంబు, కరటి దానవునకుఁ గలికి చూపు,

పాశపాణికిఁ గుచ ప్రాంతోరు దర్శనం, బంధకాసురునకు నలఁతి నగవు,

ధన నాయకునకు నుత్కంఠా విశేషంబు, మహిషునకును నర్మ మర్మ కలన

-

గంధవహునకు సిగ్గు, జలంధరునకుఁ

గలికితనము, పావకునకుఁ గౌను, బలికి

వలపు నటియించుచును వార వార తనకుఁ

దాన వారికి వారికి నైనయట్లు

-

అందఱను బ్రన వెట్టుచు న వ్వధూటి

యెవ్వరికిఁ దాను బ్రమయక యెడన యుండె;

దానపై వ్రాలి చొక్కె నందఱ మనములు

గంధఫలి మీఁద వాలు భృంగముల పగిది

-

మోహినీ హావభావ విలాసములు, శ్రీనాధ కవి "హరవిలాసము" నుండి

--

=

దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత

నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు.

రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

-

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!