మనం మరిచిన మహాశయుడు.-వీణెం వీరన్న ! (నిండు గొదావరికి నిలువెత్తు సేవకుడు.)

మనం మరిచిన మహాశయుడు.-వీణెం వీరన్న !

(నిండు గొదావరికి నిలువెత్తు సేవకుడు.)

- గుర్తు చేసుకుందాం.

-

తాజ్ మహల్ నిర్మానానికి రాళ్లేత్తిన కూలీలెవ్వరు అని అడిగితే సమాదానం చెప్పడం కష్టమే .... 

-

అయితే గోదావరి ఆనకట్ట నిర్మాణంలొ "సర్ అర్డర్ కాటన్ " కి చేదోడు వాదొడుగా ఉన్నదేవ్వరు ,10వేలమంది కూలీలను సమీకరించి వారికి పనిలొ శిక్షణ నిచ్చి, సక్రమంగా వేతనాలిస్తూ ,ఆదివారం జీతంతొ కూడిన సెలవునిచ్చి, పని చేయించినదెవరు అంటే వీణెం వీరన్న పేరే చెప్పాలి .

.

రాజమండ్రి వాసి అయిన వీరన్న 1794 మార్చి 3న పుట్టాడు. చదువుంతా గొదావరీ తీరానే. ఇంజినీరింగ్ బెంగాల్లొ పూర్తీచేసి, మద్రాసులొ ఇంగ్లీషులొ ప్రత్యేక శిక్షణ పూర్తీచేసి,1840లొ రాజమండ్రికి వచ్చి నీటిపారుదల శాఖలొ ఉధ్యొగిగా చేరాడు .1844 వ సంవత్సరములొ గొదావరి పరివాహిక ప్రాంతాన్నీ పరశీలంచడానికి కాటన్ అదికారి వచ్చాడు .పై అదికారులు కాటన్ దొరకి సహయ అదికారిగా వీరన్నని నియమించారు. ఆనకట్ట నిర్మానానికి ఒరిస్సా , బెంగాల్ నుంచి వందలాది మందిని తీసుకొచ్చి, మన్యం ప్రాంతంలొ గిరిజనులతొ కలుపుకొని నిర్మాన పనిలొ శిక్షణ ఇచ్చి, మంచి వేతనాలు ఇచ్చి, బయటినుంచి వచ్చిన శ్రామికులను చూపించి, స్థానికల్లొ మంచి ఉత్సాహన్నీ నింపి ,ఐదు యేళ్లు పాటు సాగిన నిర్మాణంలొ ఏ ఒక్కరికీ కూడా ప్రాణానికీ హాని జరగకుండా గోదావరి వంతెన నిర్మాణం పూర్తీ అయిందంటే అప్పట్లొ ఆయనకే చెల్లింది.

.

1852 మార్చి 31న వంతెన నిర్మాణం పూర్తీ అయింది. కాటన్ దొర తన డైరీలో

వీరన్న లేకపొతే ఈ ఆనకట్ట నిర్మాణం ఇంకా 10 యేళ్లు దాకా పట్టేది అని,వారికి జన్మతా రుణపడి వుంటాను అని తన డైరీలో వ్రాసుకొన్నాడు.

ఎటువంటి బిరుదులైన బ్రిటీషువారు ఇద్దరకీ కలిపి సత్కరించేవారు ,కానీ మనవాళ్లు అతని సేవలు మరిచిపొయారు .గొదావరి వంతెన ఎవరు కట్టించారు అంటే ,కాటన్ దొర అని ఠక్కున చెపుతారు, కానీ వీరన్న పేరు మాత్రం ఎవరకీ తెలియదు. బ్రిటీషువాళ్లకు ఇతని పేరు సుపరిచితం .వారి రాజ శాసనంలో వీరన్న పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు.

.

విశిష్టమైన సేవలందించిన ప్రముఖలను ఎన్నటికి మరవకూడదు. రేపటి తరాలకి మన ఘన చరిత్ర గురించి తప్పకుండా తెలపండి. 

కుహానా చరిత్రకారుల చేసిన దేశ ద్రోహాన్ని సరిదిద్ది మన ఘన చరిత్ర గురించి రేపటి తరాలకి తెలియచేయండి.

గుర్తు పెట్టుకోండి:

తరం మారితే చరిత్ర మిగలదు.

దశిక ప్రభాకర శాస్త్రి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!