మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 22.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 22.

-

రథ్యా చర్పట విరచిత కంథః 

పుణ్యాపుణ్య వివర్జిత పంథః|

యోగీ యోగనియోజిత చిత్తో

రమతే బాలోన్మత్తవదేవ||

-

శ్లోకం అర్ధం : వీధులలో దొరికిన గుడ్డముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించినవాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసి బాలుని వలెను, ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించును.

-

తాత్పర్యము : 

ఆత్మజ్ఞానమునొందిన వ్యక్తికి ఈ సంసార విషయములపై ధ్యాసే ఉండదు. ఏమి తినుచున్నాడో, త్రాగు చున్నాడో, ఏ వస్త్రములు ధరించుచున్నాడో కూడా అతనికి తెలియదు. 

ఆ స్థితిలో అతడు ఒక ఉన్మత్తుడువలె, బాలుడి వలె చూచు వారికి కనిపించును. చిరిగిన వస్త్రములతో, మాసిన ఆకృతితో అతడు కనిపించవచ్చును. దానికి కారణము వానికి ఈ సంసార విషయములపై ఏ మాత్రము ఆసక్తి లేకపోవుట. అట్టివానికి మనసు నిశ్చలమై, వ్యవహార ప్రపంచములో మంచి చెడులకు అతీతుడై వ్యవహరించును. మనసు నిర్మలమై, యోగములో నిమగ్నమై, ఆత్మానందమును చెందుచుండును. అన్ని ఆనందముల కన్ననూ మిన్నగు ఆత్మానందము ననుభవించుచూ అతడు పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువగా ఉండును.

-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!