తలకావేరి -కావేరి నది జన్మ స్థలం.!

తలకావేరి -కావేరి నది జన్మ స్థలం.!

=

పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉండే కావేరుడు అనే రాజు

 సంతాన లేమి కారణంగా దుఃఖితుడై సంతానం కొరకు బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. ఆయన కఠోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ, 

లోపాముద్ర అనే బాలికను ఆయనకు కుమార్తెగా ప్రసాదించాడు. ఆమె కావేరుడి కుమార్తెగా పెరిగినది కావున ఆమెకు కావేరి అనే పేరు వచ్చింది. ఆ బాలికను ఎంతో చక్కగా పెంచి యుక్తవయసు వచ్చేకా ఆమెను

 అగస్త్య మునికి ఇచ్చి వివాహం చేయ తలపెట్టాడు. ఆ సమయంలో కావేరి ఒక షరతు విధిస్తుంది. ఆ షరతు ప్రకారం అగస్త్యుడు ఆమెను ఒంటరిగా వదిలి ఎక్కువసేపు ఎక్కడాఉండరాదు.

 దాని ప్రకారం అగస్త్యుడు ఆమె మాటకు కట్టుబడే ఉండేవాడు. కానీ ఒక సమయంలో శిష్యులకు విద్యను బోధిస్తూ ఆ పనిలో నిమగ్నమై ఈ కావేరిని ఒంటరిగా వదిలాను అనే విషయాన్ని మరిచిపోతాడు. ఈ విషయం కావేరికి కోపం తెప్పిస్తుంది. ఆ కోపంలో ఆమె కావేరి నదిగా మారి ప్రవహించడం ప్రారంభించింది అనేది ప్రాచుర్యంలో

 ఉన్న ఒక కథనం.

=


 


మరొక వృత్తాంతంలో కావేరిని విడిచి ఉండరాదు అనే నియమం ఉండడం చేత అగస్త్యుడు ఆమెను తన కమండలంలో జలరూపంలో నిలిపి తనతోటే ఉంచుకునేవాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో క్షామం వచ్చి ప్రజలందరూ నీరు లేక విలవిలలాడుతుండడం వల్ల అక్కడి ప్రజలందరూ విఘ్నేశ్వరుడికి మొరపెట్టుకోగా ఆయన ఒక గోవు రూపం దాల్చి గడ్డి మేస్తున్నట్టుగా నటిస్తూ ఆ కమండలంలోని నీటిని క్రిందికి పడదోస్తాడు. ఆ నీరు కావేరీ నదిగా ఆ ప్రాంతాన్ని అంతా తడుపుతూ క్షామం తీర్చిందని అంటారు.

=


కథనం ఏదైనప్పటికీ కావేరీ నది ఆ ప్రాంతాన్ని కొండలు గుట్టలు వాగులు అన్నీ కలుపుతూ సస్యశ్యామాలం చేస్తూ ప్రవహిస్తోంది అనడం నిర్వివాదాంశం. ఈ కావేరీ నదీ జన్మస్థలం తలకావేరి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు అనే జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం నుండి కావేరీనది కర్ణాటక, తమిళనాడు మరియు పాండిచ్చేరిలలో ప్రవహిస్తూ వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తోంది.

=


ఈ కావేరి నదికి హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నోయ్యల్ మరియు అమరావతి అనేవి ఉపనదులు.


=

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!