మన వాళ్ళొట్టి వెధవాయిలేనా? (ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం సూన్యం )


మన వాళ్ళొట్టి వెధవాయిలేనా?


(ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం సూన్యం )

-

ఏమివాయ్‌ మై డియర్‌ షేక్స్పియర్‌! మళ్ళీ ముఖం వేలవేసినావ్‌?? సొర్గానికి పోయినా సవితి పోరు తప్పనట్టు అమరలోకం లాటి అమెరికాకి వచ్చినా ఒక టెలుగూస్‌ కీ మరో టెలుగూస్‌ కి మధ్యన ఐకమత్యం అనే పదార్థం మీ నాన్న బుర్రలో మోడరన్‌ థాట్స్‌ వున్న సైజులో కూడా లేదే అని గుక్క పట్టి దుఃఖిస్తున్నావా? నాన్సెన్స్‌!! డబ్బుల హోదా కులాల బాధా కన్న దేశంలో కన్నా యీ “ఉన్న” దేశంలోనే మిక్కుటవని ఖేదపడుతున్నావా? డబుల్‌ నాన్సెన్స్‌!! 

-

ఎవరో అన్నట్టు మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్‌!!

.

ఐనా అసలు తెలుగు వాళ్ళకి ఐకమత్యం అవసరం అన్న

వాజెమ్మెవడో చెబితే వాడి జేజెమ్మ క్కూడా బేజారెత్తేలా ఒక్క ఘంట బిగిన ఏకధాటిగా లెక్చరిద్దును!

దాంతో వాడు డంగై పోయి నాలిక్కటుకూ కటుకూ కరుచుకుని హన్నన్నా తొందరపడి పోయి మాటే గదా మన సొమ్మేం బోయిందని రెXంత మాటన్నానూ అని ఊళ్ళో వాళ్ళందరికీ మందువిందు యిచ్చి మరీ ప్రాయశ్చిత్తం చేసేసుకోడూ? 

కాకపోతే ఏవిటయ్యా ఐకమత్యంలో వున్న గొప్పతనం? తెలుగు వాడిని చూస్తే తెలీదూ నిజానికి ఐకమత్యం వల్ల వొచ్చేది గొప్పతనం కాదు గొప్ప పతనం అని!

అసలూ, బృహన్నారదీయం పదహారో ఆశ్వాసంలో ఏమన్నాడూ “కాంపిటీషన్‌ ఈజ్‌ ద ఎస్సెన్స్‌ ఆఫ్‌ ప్రోగ్రెస్‌ ” అని కాదూ? 

అందుకే మనం ఊరుకో ఇరవై తెలుగు సభలో పెట్టి పోటీలు 

పడకపోతే చకచకా ప్రోగ్రెస్‌ సాధించటం మనవల్లయ్యే పనేనా?

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!