-'శ్రవణానందం '!!

-

-'శ్రవణానందం '!!


-

'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.


సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు


వాలు చూపులు రెండు వేలు సేయు


నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు


విర్రవీగుట లారువేలు సేయు


పదమొక్కటియె సేయు పదివేల వరహాలు


లావణ్యమది యొక లక్ష సేయు


బలుసోయగమె సేయు పది లక్షల వరాలు


కులుకు నడక తీరు కోటి సేయు


ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు


నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు


నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు


నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!౨.


కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రి గాక


వైకుంఠుపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక


హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖనిర్మిత దర్విగాక


కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములుగాక


చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్బుదంబు గాక


విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువు గా!!౩.


స్మితేన భావేన చ లజ్జయా భియా


పరాజ్ముఖైరర్థకటాక్షవీక్షణైః


వచోభి రిర్త్యాకల హేన లీలయా


సమస్తభావైః ఖలు బన్దనం స్త్రియః!!


----

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!