రా" - రమ్మని రా రా రమ్మని !

రా" - రమ్మని రా రా రమ్మని !


--

అడిదము సూరకవి ఒకసారి విజయనగర ప్రభువు

 విజయరామరాజుమీద ఏకవచన ప్రయోగంతో 

ఒక "రా" వచ్చేట్టు పద్యం చెప్పాడు.

రాజుగారు ఏమీ అనలేదుగానీ రాజ బంధువు సీతారామరాజుకు

కోపం వచ్చి ఆక్షేపించాడు. అప్పుడు సూరకవి ఆవిధంగా

చెప్పటంలోని ఔచిత్యాన్ని, అందాన్ని

ఇలా సమర్థించుకున్నారట.

-


చిన్నప్పుడు రతికేళిక

నున్నప్పుడు కవితలోన  యుద్ఝములోనన్

వన్నె సుమీ "రా"-కొట్టుట 

చెన్నుగనో పూసపాటి సీతారామా!

-


చిన్నప్పుడు "రా" -  అనడం సహజమే.

రతిక్రీడలో స్త్రీపురుషులు పరస్పరం "రా" అనుకోవటం

భోగాతిశయాన్ని సూచిస్తుంది.

కవిత్వంలోనూ, యుద్ధంలోనూ అనవచ్చు.

అనవచ్చుమాత్రమేకాదు అంటే వన్నె సుమా!

-


అందుకే అతని చాతుర్యాన్ని చూసి ఇలా అన్నారు.

-


అంతా సుకవులు గారా?

అంతింతో పద్య చయము నల్లగలేరా!

దంతివి నీతో సమమా?

కాంతా సుమబాణ! సూరకవి నెరజాణా!

-



"రా" -  కొట్టటాన్ని గురించి మరోకవి పద్యం ఇది.

-


కవులు పొగడువేళ కాంతలు రతివేళ

సుతులు మద్దువేళ  శూరవరులు

రణము సేయువేళ రా కొట్టి పిలుతురు

పాడి యదియు మిగుల భజనకెక్కు

-


ఏకవచనం ప్రయోగించటాన్ని గురించి సంస్కృతంలో

ఒక శ్లోకం ఉంది

తెలుగులోని పద్యాలన్నీ దాని అనుసరణలే.

ఆ శ్లోకం.......

-


బాల్యే సుతానాం సురతేంగనానాం

స్తుతే కవీనాం సమరే భటానాం

త్వంకార యుక్తాహి గిర: ప్రశస్తా:

కస్తే ప్రభో! మోహతరస్మరతం.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!