ముద్దుల నా యెంకి! (యెంకి పాటలు -నండూరి సుబ్బారావు)

ముద్దుల నా యెంకి!

(యెంకి పాటలు -నండూరి సుబ్బారావు)

.

ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

.

కూకుండ నీదురా కూసింతసేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది

.

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

కన్ను గిలికిస్తాది నన్ను బులిపిస్తాది

.

దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

యీడుండ మంటాది యిలుదూరిపోతాది

.

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

మందో మాకో యెట్టి మరిగించినాదీ

.

వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ॥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!