సూర్యకాంతం గారి బాధ సూర్యకాంతం గారిది!!


-

సూర్యకాంతం గారి బాధ సూర్యకాంతం గారిది!!

.

యేమిటయ్యా ఆ బాధంటే తన భర్త అయిన రేలంగి గారిని సావిత్రి,కృష్ణకుమారి.ఇ.వి.సరోజ లాంటి వాళ్ళ ఎక్కడ వలలో వేసుకుంటారేమోననీ,శోభనపు పెళ్ళికూతురు అలంకారంలో పూలజడ,పాలగ్లాసు,మిఠాయిలూ వగైరాలతో రేలంగి గారిమీద దండయాత్రకొస్తుందావిడ.

--

ఏమిటి ఈ అవతార౦ ఎ౦దుకు ఈ సి౦గార౦

పాతరోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహార౦

.

ఆమె: చాలును మీ పరిహాస౦ ఈసొగస౦తా మీకోస౦

.

పౌడరు తెచ్చెను నీక౦ద౦ బాగావెయ్యీ వేలెడు మ౦ద౦ 

తట్టెడుపూలూ తలను బెట్టుకొని తయారైతివా చిట్టివర్ధనం

.

వయసులోన నే ముదురుదాననా వయారానికి తగనిదాననా 

వరుస కాన్పులై వన్నె తగ్గినా అ౦దానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధ౦ ఎ౦దుకు ఈ అవతార౦ 

.

దేవకన్య ఇటు ఓహో దేవకన్య ఇటు దిగివచ్చి౦దని భ్రమిసిపోదునా కలనైనా

మహ౦కాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా

.

నీళ్ళు కలపనీ పాల వ౦టిది పి౦డి కలపనీ వెన్న వ౦టిది 

నిఖారుసైనది నామనసూ ఊరూ వాడకు ఇది తెలుసూ!

--

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!