సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (41) -

శుభం -
సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (41)

-

తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా

నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటమ్ !

ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్ధిశ్య దయయా

సనాభాధ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ !!

-

స్త్రీ _ పురుష నాట్యాలకు ప్రతీకలైన సమయ_ తాండవ నృత్య కేళిలో

అంబా పరమేశ్వరుల నవరసాత్మక సమ్మేళనం చేతనే , ప్రళయ మందుదగ్దమైన జగత్తు తిరిగి సృష్టించ బడుతుంది. ఇది ఆనంద తాండవనృత్యం . జగదుత్పాదక సూత్రం .

" ఆనందలహరి " విభాగానికిఅంతంలో చెప్పబడిన ఈ శ్లోకము వల్ల ఆనందభైరవీ _ మహాభైరవుల

శృంగార మే నృత్య మని తెలియ దగును.

.

తల్లీ ! నీయొక్క మూలాధార చక్రమందు , లాస్య నాట్యమునందు

ఆసక్తి గల సమయా అనిపేరుగల ఆనందభైరవి అనే శక్తితో కలసి

శృంగారాది నవరసములతో కూడిన మహా తాండవ నృత్యాన్ని 

నటించే నటుడైన వానిని , నవాత్ముడైన ఆనంద భైరవునిగా 

భావిస్తాను. 

దగ్దమైన జగత్తును మరలా సృష్టించే విధానాని కై

దయతో కలసియున్న మీ యిద్దరి చేతనే ఈ జగత్తు తల్లి దండ్రులు

కలదైయున్నది . శివ దంపతులు సమయాంబ _ మహానటేశ్వర

నామములతో మూలాధార చక్రములో పృథివీ తత్త్వానికీ తొమ్మిది

మూల ప్రకృతులకూ ఉత్పాదకులుగా ఉంటారు.

ఈ జగత్తు యొక్క సృష్టి కార్యంలో శివాశివులు ఇద్దరూ

నవరసానంద సంధాయకమైన

లాస్య తాండవము అనే నృత్యములు చేస్తారు. 

అందువల్ల వారులోకానికి జననీ జనకులు.

.

ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచి(ఝి)ల్లికాయైనమః

ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయైనమః

ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయైనమః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!