భర్త గారు రాసిన ప్రేమ లేఖ !

భర్త గారు రాసిన ప్రేమ లేఖ !


విరబూసే వెన్నెల నవ్వితే ఎలా ఉంటుందీ...?


నిండు పున్నమినాడు గలగలల గోదారి ప్రశాంతపు పరవళ్లు ఎలా ఉంటాయి...?


ప్రకృతి ఒడిలో ముత్యపు వాన చినుకుల్లో తడుస్తూన్నప్పుడు ప్రేమించే హృదయం హత్తుకుంటే ఎలా ఉంటుందీ...?


సంధ్యా సమయంలో పక్షుల కిలకిలలమధ్య ఇరు ప్రేమ హృదయాల ఎదలోతుల్లో పురివిప్పిన ప్రేమలయల మూగ వేదన ఎలా ఉంటుంది...? 


..

ఇటువంటివన్నీ ప్రేమికుల ఎదఎదనూ పైకెగదోయు అంశాలే... చెప్పాలంటే ప్రేమికులు వల్లించే విరహ భావనల లోతులు ఇంతకన్నా ఘాటుగానే ఉండవచ్చు. ఆ ఘాటైన ప్రేమ గుళికల రసానందం కేవలం ప్రేమికులకే తెలుసు. ఆ రసానందం కాస్సేపు దూరమైతే చాలు...


చనువెరిగిన హృదయం దూరమైనప్పుడు అనుభవించే విరహవేదనను చంపకమాలగానూ

ఊరిస్తూ ఉరకలవేయిస్తూ వయసు చేసే అలజడులు ఉత్పలమాలగానూ 

కను రెప్పలమాటున దాగిన ఇష్ట స్వరూపి బింబం కంద పద్యంగానూ... ఎంత వర్ణించినా.. ఎలా చెప్పనూ... ఇంకా ఏదో చెప్పాలి.. చెప్పాలి... రాయాలి... రాయాలి.. రాస్తూనే ఉండాలి.. ప్రేమలేఖలు. 


ఆ అందమైన ప్రేమలేఖల అక్షరపు విలువ వెలకట్టలేనిది. మనిషి ఉనికి లేకున్నా వారి మనసుతో మాటాడించే తీయనైన భావనే ఆ ప్రేమలేఖ. అటువంటి ప్రేమలేఖ బుగ్గైతే... అప్పటివరకూ మనసు దోచిన నెలరాజు/ వెన్నెల రాణిని పలువరించే ప్రేమాక్షరాల ప్రాణాలు పోవూ.

--

--

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!