మా తాత గారు వింజమూరి జోగయ్య పంతులు గారు.!






=

మా తాత గారు వింజమూరి జోగయ్య పంతులు గారు.!

.

మా తాత గారు వింజమూరి జోగయ్య పంతులు గారు

పిఠాపుర రాజు గారి దివాణం లో పండితులు....

మహారాజు గారు ఈ పద్యం తరచు వినిపించు కొనే వారుట....

మా నాన్నగారు ఈ పద్యం చదివి మాకు విని పించే వారు...

మాకు చాల ఇష్టం. ధన్యులం.

.

ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వరశతకము.

అంతా శంశయమే శారీరఘటనం బంతా విచారంబే లో

నంతా దుఃఖపరంపరాన్యితమే మేనంతా భయ బ్రాంతమే

అంతా నాంత శరీర శోషణమే దుర్యాపారమే దేహికిన్

చింత న్నిన్నుదలంచి పొందరు నరుల్ శ్రీకాళిహస్తీశ్వరా !

.

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీవానికి అంతా సందేహమే.

ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో సంశయమే కదా ! 

మనస్సులో భార్య పుత్రుల సంభంధం పెంచుకోవడం వలన అంతా దుఃఖమే! శరీరమునకు రోగామేప్పుడు వచ్చునో నను భయమే. అన్ని పనులు శరీరమును కృశింప చేయునవే మనుషులు చేయు పనులన్నీ దుర్యాపారములే. ఇవన్ని కర్మలను అనుసరించి పునర్జన్మ కలిగించును. వీని నన్నిటిని విడిచి మనుజులు నిన్ను చేరు ఉపాయములు అలోచింపరు. భగవంతుని చేరుటకు చేయు పనులు అన్ని సద్యాపారములు గాను , బ్రతుకు తెరువుకు కావలసిన పనులన్నీ దుర్యాపారములని ధూర్జటి అభిప్రాయము. 

దుర్వ్యాపారములు తప్పవు కాని సద్వ్యాపారాములు చెయ్యవలేనని దీని అంతరార్ధము .

=

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!