మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 20.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 20.

-

భగవద్గీతా కించిదధీతా 

గంగా జలలవ కణికాపీతా|

సకృదపి యేన మురారి సమర్చా

క్రియతే తస్య యమేన స చర్చా||

-

శ్లోకం అర్ధం : భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను,

గంగానదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, 

ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు! అట్టివానికి యమునివలన ఎంతమాత్రము భయము లేదు.

-

తాత్పర్యము : 

భగవత్ గీత కొంచెమైననూ పఠించిననూ, గంగా జలము కొంచెము గొంతున త్రాగినను, భక్తితో భగవన్నామము ఒకపరి పలికిననూ, యముడు కూడా వాని జోలికి పోడు. సత్కార్యములు చేయుచూ, మనసు మాధవునిపై లగ్నము చేసి జీవించు సాధువుకు 

ఎవ్వరూ కీడు చేయలేరు. త్రికరణ శుద్ధిగా, అనగా 

మనసా, వాచా, కర్మణా, భగవంతునిపై మనసు నిల్పి,

సత్కార్యము ఆచరించుచూ బ్రతుకు వ్యక్తికి 

మోక్ష ప్రాప్తి తధ్యము. 

-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!