శుభం -సౌందర్య లహరి-"!! (శ్రీ శంకర భగవత్పాద విరచితముద్వితీయ భాగము!!)

-

శుభం -సౌందర్య లహరి-"!!

(శ్రీ శంకర భగవత్పాద విరచితముద్వితీయ భాగము!!)

--

--------

సౌందర్య లహరి రెండు భాగములుగాఉన్నది .

మొదటి నలుబది ఒక్క శ్లోకము లు ఆనంద

లహరి భాగమునకు చెందినవి.

శ్రీ శంకరాచార్యులవారు నేరుగా కైలాసం నుండి తెచ్చినవి.

మిగతాయాభైతొమ్మిది శ్లోకములు ఆచార్యులవారి చేతనే

పూరింపబడినవి.

-

ఒకటి నుండి 41 వ శ్లోకము వరకు గల శ్లోకములను

" ఆనందలహరి " అని 42 వ శ్లోకము నుండి

" సౌందర్యలహరి " అని వ్యవహారం లో ప్రసిద్ధి .

--

శ్రీ శంకర భగవత్పాదులు , దేవియొక్క శిరస్సునుండి

పాదములవరకూ, 59 శ్లోకము లలో 42వ శ్లోకము 

నుండి ప్రారంభించి దేవిని స్తుతించారు. దేవియొక్క 

స్థూల రూపాన్ని భావనచేస్తూ, అందులోని ఉదాత్తత

నూ, మాహాత్మ్యాన్ని గ్రహించడానికి అనుకూలంగా 

దేవియొక్క శరీరావయవ సౌందర్యాన్ని శంకరులు

వర్ణించారు. 

44వ శ్లోకము లో "సౌందర్య లహరి "అనే పదాన్ని ఉపయోగించి , శంకరులు ఈ రెండవ 

భాగానికి " సౌందర్య లహరి " అనే వాడుకకు సావకాశము

కల్పించారు. 

ఈ 42వ శ్లోకములో శంకరులు దేవియొక్క శిరస్సు పైగల 

కిరీటాన్ని , చంద్ర రేఖనువర్ణించడం జరిగింది . 

ఈ శ్లోకము లో ఆచార్యులుదేవి శరీర వర్ణనను కిరీటముతో 

ప్రారంభించి తరువాతి శ్లోకములలో పాదములవరకూ వర్ణించారు. దేవతలను పాదములనుండి శిరస్సు వరకు వర్ణించడం

కావ్య మర్యాద . అయితే శంకరులు 

దేవిని కిరీటము నుండి ప్రారంభించి వర్ణించడంలో

ఔచిత్యమున్నది.

" శ్రీ లలితాసహస్రనామాలలో " దేవికి 

"చిదగ్నిగుండసంభూతా" అనే ఒక నామం వుంది .

అగ్ని కుండం నుండి దేవి పైకి వచ్చేటప్పుడు, శిరస్సు

ముందుగానూ, మిగిలిన అవయవాలు తరువాతనూ

కనబడుతాయి. కాబట్టి శిరస్సునుండి వర్ణన 

ప్రారంభించడం జరిగింది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!