భారతంలో నన్నయగారి చివరిపద్యం -

నన్నయగారి చివరిపద్యం:

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానాలైన నక్షత్రమాలికలతో కూడి ఉన్నవి, వికసించిన కొంగ్రొత్త తెల్ల కలువల దట్టమైనసుగంధంతో కూడిన గొప్పగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటావెదజల్లబడిన కప్పురపు పుప్పొడివలె ఆకసాన్నిఆవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి మిక్కిలి సొగసుగా వున్నాయి.
దీంట్లో నన్నయ తనమహాభినిష్క్రమణని సూచించాడా?
విశేషంలో వివరణ ఇలా వుంది: కొందరు పండితులు
ఈ పద్యంలోని చివరిపదగుంఫనం - పాండురుచిపూరములు + అంబరపూరితంబులై -
అని విరవటానికి బదులు - పాండురుచిపూరములన్ + పరపూరితంబులై- అని సంధి విశ్లేషిస్తే,నన్నయ చివరిమాట "పరపూరితంబులై" అని ఏర్పడుతుంది.
అంటే భారతం పరులుపూర్తి చెయ్యాల్సిందేనని నన్నయ తన మరణాన్ని సూచించాడు!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.