స్త్రీలకి చీరే శ్రీరామరక్ష!

స్త్రీలకి చీరే శ్రీరామరక్ష!

.

"మన్ది హిందూదేశం."

"........ "

"ఇది పరమ పవిత్రమైన భూమి."

"....... "

"ఆడది ఆదిపరాశక్తి."

"........ "

"ఈ దేశంలో స్త్రీని శక్తిస్వరూపిణిగా పూజిస్తాం."

"........ "

"స్త్రీల అందమంతా వారి చీరకట్టులోనే వుంది."

".......... "

"చీర మన భారతీయ సాంప్రదాయం."

"............ "

"స్త్రీలకి చీరే శ్రీరామరక్ష."

".......... "

"చీర కట్టిన స్త్రీని ఒక్కడు కూడా రేపు చెయ్యడు. చేస్తే నన్ను చెప్పుచ్చుకు కొట్టండి!"

"............ "

"బాపు బొమ్మకి చీరే అందం"

"............ "

"విశ్వనాథ్ సినిమాలకి చీరే ప్రాణం."

"............ "

"రోజులు మారిపోతున్నాయి, ఆడాళ్ళు మరీ బరితెగించిపోతున్నారు."

"............ "

"లేకపోతే ఆ డ్రస్సులేవిఁటీ ఛండాలంగా!"

"........... "

"జేసుదాసు అన్నాడంటే అనడా మరి?"

"......... "

"నన్నడిగితే చీర కట్టని ఆడదాన్ని షూట్ చేసి పారెయ్యాలంటాను."

"........... "

"దేశానికిప్పుడు మంచిరోజులొచ్చేశాయి. మన్ని రక్షించడానికి దేవుళ్ళా మోడీ వచ్చాడు! మోడీ మన్‌మోహన్‌లా ముంగి కాదు, అసలుసిసలైన మగాడు! ఆడాళ్ళని ఎక్కడుంచాలో అక్కడుంచుతాడు!"

"............ "

"మేస్టారూ! ఇందాకట్నుండీ నేనే మాట్లాడుతున్నాను. మీరేంటి ఒక్క ముక్కా మాట్లాడరు!"

"ఏం మాట్లాడమంటారు? మీరు మాట్లాడుతున్నారుగా!"

"అవుననుకోండి! మీరసలేం మాట్లాడకపోతేనూ!"

"అయ్యా! మీరు 'శ్రీరామసేన' సభ్యులా?"

"రామరామ! ఆ పేరెప్పుడూ విన్లేదండీ!"

"తొగాడియా శిష్యులా?"

"మిరపకాయ తొడాలు తెల్సండీ! తొగాడియా తెలీదు."

"సాక్షి మహరాజ్?"

"బాపు రమణల 'సాక్షి' చూశాను, అంతే!"

"ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండీ, మీరేం చేస్తుంటారు?"

"ఇందులో అనుకోటానికేవుఁందండీ! 'పడవల పిచ్చయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? ఆ దుకాణం మాదేనండీ! 'పడవల పుల్లయ్య అండ్ సన్స్' పేరిన్నారు కదండీ? అది మా బాబాయ్ కొడుకుల్దండీ! మాది చీర్లేపారవఁండీ! మా బాబాయోళ్ళది రెడీమేడ్ దుస్తుల యాపారవఁండీ! ఆళ్ళు కోట్లకి పడగలెత్తారండీ! మనం మాత్రం యిక్కడే వుండిపొయ్యావఁండీ!"

"అయ్యో!"

"ఏజేస్తావఁండీ? టైం బ్యాడండీ! ఇవ్వాళ ఆడలేడీసులు చీర్లు కట్టం తగ్గించేశారు కదండీ! మనం యాపారంలో దెబ్బైపొయ్యవఁండీ! మోడీ రావాలి - అప్పుడు గానీ ఈ ఆడముండలు చీర్లే కట్టాలని రూల్రాదని మా బామ్మర్ది చెప్తుంటాడండీ."

"ఓ! మీ సమస్య ఇప్పుడర్ధమైంది. మీ కోరిక నెరవాలని కోరుకుంటున్నాను."

"థాంక్సండీ!"

Comments

  1. వావ్ ,

    మరో ఆణి ముత్యం ! సూపెర్ డూపర్ !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
      నేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.

      Delete
  2. వింజమూరి వారు,

    చాలా బాగా విశ్లేషించి శ్రీ రామ రక్ష గురించి సమీక్షించేరు ! ఇట్లాంటి మంచి టపాలు చదివి ఏళ్లయ్యింది ! చాలా బాగా రాస్తున్నారు ! కీప్ ఇట్ అప్ !

    మీ ఇతర టపాలు కూడా రియల్లీ మార్వేల్లెస్ !

    మీరు తెలుగు వార పత్రికల్లో రాయాలి ! అప్పుడు మీ ప్రతిభా పాటవాలు ఆంధ్ర తెలంగాణా జన వాహిని కి మరింత పరిచయ మవుతుంది .

    మీ శైలి నిశ్చయం గా తెలుగు దేశం లో ని మేలైన రచయితల మేళ వింపు ! సూపెర్ డూపర్ !

    చీర్స్

    ReplyDelete

  3. మీ టపాలు తెలుగు అగ్రేగేటర్ (మాలిక, కూడలి ) లో రావటం లేదు. దయచేసి వాటిల్లో మీరు మీ బ్లాగు ని చేర్చండి. ఇట్లాంటి మంచి మంచి టపాల మిశ్రమం తెలుగు వాళ్లకి చాలా చాలా బాగా నచ్చుతుంది.

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  4. మీరు కేక సుమండీ! చాలా బాగా రాసారండీ..... అసలి మీకిలాంటి ధాట్సు ఎలా వచ్చునోకదాయని ఆశ్చర్యపోవుచుంటిని. మీయొక్క హస్తలాఘవం అంగా కీబోర్డులాఘవం ఏదైతే ఉందో... అది చాలా గొప్పది సుమండీ! అవునుగానీ మాస్టారూ మీకు బెంగాలీకూడా వచ్చేమిటండీ? గీతాంజలి అనే కవితా సంకలనాన్ని టాగోర్ అనే కలంపేరుతో అలారాసిపారేశారు? గత ఏడాది మీరు Mo yan అనే కలం పేరుమీద రాసిన రచనలను చదివి మతిపోయిందంటే నమ్మండి.

    మీలాంటి ప్రతిభావంతులు చీకట్లో అనామకుల్లాగా ఉండిపోకూడదుసార్! మీరు వెలుగులోకి వచ్చి మాజీవితాలమీద వెలుగురేఖలను ఫ్లడ్‌లైట్లలాగా ప్రసరింపజేయాలి.

    ReplyDelete
    Replies
    1. మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
      నేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.

      Delete
  5. వింజమూరివారూ!

    చాలా బాగా రాసారండి. మీరు పనిలేక రాసిన రాతలు చాలా అద్భుతం.

    మీ Xerox copying వ్యాపారం బాగా సాగుతోందనుకుటా.

    ReplyDelete
    Replies
    1. మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
      నేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.

      Delete
  6. isn't it copied from someone else blog?

    ReplyDelete
    Replies
    1. మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
      నేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.

      Delete
  7. అయ్యా, మీకు జిలేబి గారు పీకిన పీకుడు అర్ధం కాకపోవడం నిజంగా శ్రీరామ రక్షే.

    ReplyDelete
  8. మంచి పంచు కుంటున్నాను... నాకు నచ్చిన పోస్ట్ లు సంకలనమే...
    నేను రచయితను కాను... ఈ బ్లాగ్ కూడా ప్రచారానికి కాదు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!