కొత్త పాటలు .. కోసం ఎదురుచూపులు.

కొత్త పాటలు .. కోసం ఎదురుచూపులు.

కొత్తపాటలు పాడుకొమ్మందిరా....

.

వుత్త మాటలు!

(యెంకి పాటలు నండూరి సుబ్బారావు)

(కొత్త పాటలు .. కోసం ఎదురుచూపులు.మరో సుబ్బరావు రావాలి)

.

వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి

కొత్తపాటలు పాడుకొమ్మందిరా

వూరెల్త ననిపలికి

మారేస మేసుకొని

సకినాల పాటొచ్చు

సకిన మడుగన్నాను

వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి

కొత్తపాటలు పాడుకొమ్మందిరా

యీరోజు నీరాజు

వూరెల్లినా డంటి

యే రాపులోరూపు

మారిపోయిందంటి

వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి

కొత్తపాటలు పాడుకొమ్మందిరా

మొదల మీరీయేటి

మొగనె కలిశారంటి

మెరుపల్లె పాటెత్తి

మురిపించినా డంటి

వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి

కొత్తపాటలు పాడుకొమ్మందిరా

కొద్దిలో వొరహాల

కొడుకునెత్తే వంటి

యీ నిజమ్ము తేలేకె

యీనాములిమ్మంటి

వుత్తమాటలు నీవి పొమ్మందిరా యెంకి

కొత్తపాటలు పాడుకొమ్మందిరా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!