అమర గాయకులు ఘంటసాల...

Sahana Meenakshi

అమర గాయకులు ఘంటసాల ...

తెలుగు సంగీత శ్రోతలు అందరూ.. నాటి నుండి నేటికీ అభిమానించి స్మరించే ఒకే ఒక్కరు అమర గాంధర్వ గాయకుడు.. శ్రీ ఘంటసాల.. వెంకటేశ్వర రావు గారు .. తెలుగు సినిమా సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఈ అమర గాయకుడు.. పాడిన.. పాటలు.. నేటికీ మనం అందరం పాడుకుంటూనే ఉన్నాము.. అయన కేవలం గాయకుడు మాత్రమే కాదు..గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. అయన వంద సినిమాలకు పైగా గొప్ప సంగీతాన్ని సమకూర్చారు.. 1940 లలో.. పాడటానికి పనికి రాడు అనుకున్న ఆ గాయకుడే ఇంత గొప్పగా మన అందరి మదిలో నిలిచి పోతారు అని ఎవరు మాత్రం ఉహించి ఉంటారు..మనదేశం చిత్రంతో ప్రారంభమైన ఆ గాయకుని సంగీత యాత్ర.. మళ్లీ తిరిగి చూసుకోలేదు.. పాతాల భైరవి, చంద్ర హారం, మాయాబజార్, చిరంజీవులు.. కన్యాశుల్కం..అభిమానం, శాంతి నివాసం, దీపావళి.. వినాయకచవితి, గుండమ్మ కథ, లవకుశ, పాండవ వనవాసం...రహస్యం . వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు అయన అజరామరమైన సంగీతాన్ని అందించారు.. తెలుగులోనే కాదు అయన కన్నడ, తమిళ చిత్రాలకు కూడా పాడారు.. ఆయనకు హిందీలో పాడమని ఎన్నో అవకాశాలు వచ్చినా.. మాతృ భాషపై గల మమకారంతో.. సున్నితంగా తిరస్కరించి.. తెలుగు భాషకే అధిక ప్రాముఖ్యతనిచ్చారు.. అయన పాడిన జయభేరి చిత్రం లోని.. "రసిక రాజ తగు వారము" .. జగదేక వీరుని కథలోని.. "శివ శంకరి, శివానందలహరి" .. వంటి ఎన్నో పాటలు.. నేటికీ మన అందరికీ శ్రావ్యంగా వినబడుతూనే ఉన్నాయి....తెలుగు జాతిపై దేవతలకు ఉన్నట్టు ఉండి అసూయ కలిగి....ఆ గాయకుడి గానం తమకూ కావాలని కోరుకున్నారు.. అంతే.. ఒక సంగీత తార రాలిపోయింది.. భువి నుండి దివికేగిన ఘంటసాల అక్కడ అమరసభలొ.. తన దివ్య గానంతో అందరినీ మైమరపిస్తునే ఉండి ఉంటారు.. అయన లేరు.. కాని అయన పాట మాత్రం.. మన అందరి మదిలో.. హృదయాల్లో.. రసడోలలు ఊగిస్తూనే ఉన్నాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!