యెంకి పాటలు....

యెంకి పాటలు....

౧.కనుబొమ్మలు


నన్ను తలుసుకు యెంకి కన్ను మూయాలి!


కనుబొమ్మ సూడాలి!

కరిగిపోవాలి!


నన్ను కలలో సూసి నవ్వుకోవాలి!

కనుబొమ్మ సూడాలి!

కరువు దీరాలి!


నిదరలో సిగపూలు సదురుకోవాలి!

కనుబొమ్మ సూడాలి!

కమ్మగుండాలి!


పిలుపేదొ యినగానె తెలివి రావాలి!

కనుబొమ్మ సూడాలి!

కతలు తెలియాలి

.................................

౨. ముద్దుల నా యెంకి


గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ

కూకుండ నీదురా కూసింత సేపు!

…………………..

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది,

యెల్లి మాటాడిస్తె యిసిరికొడతాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది,

దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

యీడుండమంటాది ఇలు దూరిపోతాది,

యిసిగించి యిసిగించి వుసురోసుకుందీ!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

……………….

మందో మాకో యెట్టి మరిగించినాదీ,

వల్లకుందామంటే పాణ మాగదురా!

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ ||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!