తెలుగువారికి రుక్మిణంటే గౌరవం. సత్యంటే యిష్టం.

రుక్మిణీ సత్యలకూ, కృష్ణునకూ మధ్య వున్న అనుబంధాల వైచిత్రికి భావబంధురమైన రూపకల్పన చేస్తూ,

నందితిమ్మనగారు 

"భోజకన్యా సరిద్రాజహంసము, 

సత్యభామా శుకీ కేళిపంజరంబు" అని కృష్ణుణ్ణి అభివర్ణించారు.


రుక్మిణి అనే నదిలో విహరించే రాజహంసట కృష్ణుడు! 

సత్యభామ అనే ఆడుచిలుక ఆడుకునే పంజరమట కృష్ణుడు!


తెలుగువారికి రుక్మిణంటే గౌరవం. సత్యంటే యిష్టం. 


రుక్మిణి మప్పితంగా వుంటుంది. సత్య విసురుగా వుంటుంది. 


రుక్మిణి కృష్ణుణ్ణి పూజిస్తుంది. సత్య కృష్ణుణ్ణి కలవరిస్తుంది. 


రుక్మిణి అప్పుడే స్నానం చేసి మడి కట్టుకున్నట్లుంటుంది. సత్య కృష్ణుని పడకగదిలోంచి అప్పుడే 

బైటికి వచ్చినట్టుంటుంది. 


రుక్మిణికి కోపం వచ్చినా కనబడదు. ఏడుపూ అంతే! సత్యకు కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా కట్టలు 

తెంచుకుంటుంది. 


రుక్మిణికి కోపం వచ్చినా కనబడదు. ఏడుపూ అంతే! సత్యకు కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా 

రుక్మిణికి కోపం వచ్చినా కనబడదు. ఏడుపూ అంతే!

సత్యకు కోపం వచ్చినా, ఏడుపు వచ్చినా కట్టలు తెంచుకుంటుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!