ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️ (ముళ్ళపూడి గారి ముచ్చట్లు.) 🐦

ఆ ముగ్గురు భామల ముచ్చట కధ ☝️


(ముళ్ళపూడి గారి ముచ్చట్లు.)


🐦

మీరు నమ్మండి- ఇది నిజం – మా హైకమాండ్ కమిటి సెలక్షన్ పరీక్షల్లో "హేమమాలిని, జయలలితను" కూడా చూసాం. 

టెస్టులు తీసాం. వాళ్ళిద్దరూ సినిమాలకి పనికి రారని రూలింగ్ ఇచ్చేశాం!

👩

మొన్నటి హేమమాలిని – నిన్నటి డ్రీం గర్ల్ కాదు- సన్నగా చీపురుపుల్లలా చిటికెనవేలు లావుండేది. మాకు రేకు గ్లాసుల్లో టీ ఇచ్చింది. వాళ్ళమ్మగారు కూడా చెప్పారు- చాన్స్ ఇస్తే ఆపిల్సు, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తా నన్నారు. ఐనా మేం ఒప్పుకోలేదు.

.

తరువాత హేమ(గారు) అనంతస్వామి అనే లాయరు గారి కాంట్రాక్ట్ ద్వారా డ్రీం గర్ల్ గా రూపు ధరించి ఎదిగి రాజకపూర్ తీసిన

‘సపనోం కీ సౌదాగర్’ చిత్రంతో గొప్ప తార అయింది. 

‘షోలే’ లో వసంతి-‘నసంతి’ లాటి వేషాలతో రెండు దశాబ్దాలు

(ధర్మేంద్ర) మహారాణిగా ఏలింది. 

ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టారే! తన కూతుళ్ళతో పోటీపడి నాట్యం చేయగల గొప్ప నర్తకి.

👩

అలాగే జయలలితకి స్లైయిట్ మెల్ల (అదృష్టం మెల్ల) అన్నారు సెల్వరాజు గారు. ఆమె దరిమిలా తెలుగు తమిళ చిత్రాల్లో సూపర్ స్టార్ అయింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయింది. రాజ్జి అయింది.

👩🏼

ప్రమాదో ధీమతామపి.... ఇలాటి తప్పులు పరిశ్రమకి కొత్తకాదు.

మహానటి సావిత్రిని సినిమాలకి పనికిరాదని ఎల్.వి.ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు.

👨‍🏫

రావుగోపాలరావు వాయిస్ సినిమాకి సూటబుల్ కాదని- ఆనాటి సౌండ్ పండితులు భావించి ఆయన నటించిన పాత్రకి వేరొక గాత్రంతో డబ్బింగ్ రుబ్బించారు.

😘

నాగయ్యగారికి వయసు మళ్ళాక పి.బి.శ్రీనివాస్ తో పాటలు పాడించారు.... 

😋

20 వ శతాబ్ది వేదం- శ్రీ శ్రీ ‘మహాప్రస్థానం’ కవితను భారతి పత్రిక తిరస్కరించింది.”

.

----- *కోతి కొమ్మచ్చి – బాపు రమణీయం *

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!