బొడ్డపాటి కృష్ణారావు 🚩 (సేకరణ ) 💥

బొడ్డపాటి కృష్ణారావు 🚩

(సేకరణ )

💥


స్వచ్ఛమైన భాష--'మాయాబజార్‌'లోనే ఒకే దృశ్యంలో 

'శంఖుతీర్థులు' కనిపిస్తారు. ''

శంకుతీర్థుల వారంటే- కూలంకష ప్రజ్ఞావంతులు!'' అని, 

కౌరవుల పక్షంలో ఉన్న శాస్త్రి (వంగర) శ్లాఘిస్తారు.


ఆ శంఖుతీర్థులు బొడ్డపాటి. బొడ్డపాటి కృష్ణారావు.


స్కూలు మాస్టరు ఉద్యోగం చేసేవారు బందర్లో. 

వేద పండితుడు. పురాణాలు క్షుణ్నంగా చదువుకున్నారు. 

నాటకాల్లో హాస్యపాత్రలు ధరించేవారు. 'వినాయకచవితి' (1957)లో వినాయక పాత్ర పెద్ద పాత్ర. అయితే, గజముఖం వెనక ఉన్న అసలు ముఖం ఎవరికి తెలుస్తుంది?


చెబితే తప్ప! అప్పట్లో ఆయన ''నాదేరా టైటిల్‌ రోలు'' అని గర్వంగా సరదాగా చెప్పేవారు.


సినిమాల్లో చాలా వేషాలు వేశారు. 'గుండమ్మ కథ'లోనూ ఒక్కచోట 

కనిపిస్తారు. సాయంకాలం వేళ, రోజూ ఎన్‌.టి.రామారావు గారింటికి వెళ్లి ఆయన పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పేవారు.


తను తీసిన అన్ని చిత్రాల్లోనూ రామారావుగారు ఏదో వేషం వేయించేవారు. బొడ్డపాటి, చేతిలో గొడుగు పట్టుకుని నిరంతరం వేటే! 

వేషాలకి. ఆయన వెయ్యదగ్గ వేషం ఉంటే మాత్రం తప్పక ఇచ్చేవారు నిర్మాతలు. చిన్న, పెద్ద అందరికీ నమస్కారాలు పెడుతూ, చమత్కారాలు చేస్తూ కనిపించేవారు ఆయన.


ఎంత తిరిగినా, ఏ వేషం వేసినా, ఎంత ఇస్తారు గనక?

అలాగే కాలక్షేపం చేస్తూ వచ్చారు ఆ మంచి నటడు! చిన్న విశేషం: 'మాయాబజార్‌'లోనే, ఆ జాతక పరీక్ష దృశ్యంలో పక్కన ఇంకో నటుడు కూచుని ఉంటారు- తల వూపుతూ. డైలాగ్‌ ఉండదు.


ఆయన పేరు సి.వి.వి. పంతులు. 'పెళ్లి చేసి చూడు' తమిళంలో, ఎన్‌.టి.ఆర్‌. తండ్రి పాత్ర- తెలుగులో డా|| శివరామకృష్ణయ్య ధరించిన ముఖ్యపాత్ర- ధరించారు. తమిళ 'మాయాబజార్‌'లో, శంఖుతీర్థులు- ఆయనే. తమిళంలో, ఆయన పక్కన బొడ్డపాటి ఉంటారు.


కాని, మౌనంగా ఉంటారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!