పద్మనాభ' యుద్ధం


పద్మనాభ' యుద్ధం! -

ఎక్కడో జరిగిన తళ్ళికోట యుద్ధం గురించి తెలుగువాళ్ళందరికీ తెలుసు. మరి మన గడ్డమీద జరిగిన 

'పద్మనాభం' యుద్ధం గురించి తెలుసుకుందాం.


మన దేశం లో బ్రిటిష్ పాలన మొదలయ్యే టప్పటికి 

విజయనగరం గంజాం,విశాఖపట్టణం, శ్రీకాకుళం 

ప్రాంతాలు 20 మంది జమీందారుల అధీనం లో వుండేవి.వి

విధ కారణాలవల్ల ఈ జమీందారులు ఆగ్లేయులకు 

వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

ఆంగ్లేయులకేమో సాధ్యమైనంత తీరప్రాంతం తమ గుప్పిట్లో వుండాలన్న

పట్టుదల.ఆ ప్రయత్నాల్లోనే విజయనగరం జమీన్దారీని ఆక్రమించు కోవాలనుకున్నారు.

ఇంతలో విజయనగరం అధిపతి ఆనందగజపతిరాజు 

మరణించడం తో దానికి అవకాశం వచ్చింది.

అప్పటికి ఆయన కొడుకు చిన విజయరామరాజుది చిన్న వయసు.అందుకని ఆనందగాజపతిరాజు సవతి సోదరుడైన 

సీతారామరాజును దివానుగా నియమించారు.

విజయరామరాజు రాజు కాగానే సీతారామరాజును దివాన్ 

పదవి నుండి తొలగించారు,దాంతో సీతారామరాజు ఆంగ్లేయులతో 

జట్టు కట్టాడు. అవకాశం చూసుకొని 

ఆంగ్లేయులు తమకు చెల్లించాల్సిన ఎనిమిదిన్నర 

లక్షల పేష్కస్ చెల్లించాలని లేకపోతే జమీన్దారీని 

ముట్టడిస్తామని విజయరామరాజును హెచ్చరించారు.

రాజు దానికి ఒప్పుకోక పోవడం తో 1793 ఆగస్ట్ 2వ తేదీన

విజయనగరం కోటను ఆక్రమించుకున్నారు.

ఆగ్లేయులు రాజుకు నెలకు 1200 రూపాయలు యిస్తామనీ,

మచిలీపట్నం వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

తిరస్కరించిన రాజు విశాఖపట్టణం జిల్లా లోని పద్మనాభం చేరుకున్నాడు.

అక్కడ కొంత సైన్యం సమకూర్చుకొని ఆంగ్లేయుల మీద యుద్ద్ధం ప్రకటించాడు.

జులై 10 1794 నాడు జరిగిన ఆ యుద్ధం లో విజయరామరాజు మరణించాడు.విజయనగరం ఆంగ్లేయుల చేతిలోకి వచ్చింది.

చరిత్ర లో యిదే 'పద్మనాభయుద్ధం' గా ప్రసిద్ధి గాంచింది.


ఇక్కడ వున్న పద్మనాభస్వామి దేవాలయం కళింగ నిర్మాణ శైలిలో అలరారు తుంటుంది.


శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర విజయానికి గుర్తుగా 

నాటించిన విజయస్తంభం వున్న పొట్నూరు ఇక్కడికి సమీపం లోనిదే.


పద్మనాభం యుద్ధానికి ముందు రెండో విజయరామరాజు తనయుడు నారాయణబాబు తల్లితో కలసి కాశీపురం వెళ్లిపోయారు. ఆ తర్వాత మక్కువ చేరుకున్నారు. ఆ తర్వాత కంపెనీవారు విజయనగరానికి పిలిపించి రాజ్యాన్ని అప్పగించేశారు. దైవభక్తుడు, దానశీలురైన నారాయణబాబు పాలనలో ఖాజానా రుణగ్రస్తం కావడంతో 1817 నుంచి అయిదేళ్లపాటు విజయనగరం రాజ్యం కంపెనీ వారి స్వాధీనంలో ఉంది. 1822 నుంచి నారాయణగజపతి తిరిగి పరిపాలించినా అయిదేళ్ల తర్వాత బ్రిటీషుకంపెనీవారి పర్యవేక్షణకు రాజ్యాన్ని వదిలి కాశీక్షేత్రం వెళ్లిపోయారు. అక్కడే 1845లో పరమపదించారు.


నారాయణగజపతి ఏకైక పుత్రుడు మూడో విజయరామగజపతి 1826లో విజయనగరంలో జన్మించినా కాశీలోనే పెరిగారు. ఆయన సింహబలుడు. 1848లో తిరిగి విజయనగరం చేరుకొని పట్టాభిషిక్తుడయ్యారు. బ్రిటీషు కంపెనీవారు 1852లో రాజ్యాన్ని అప్పగించారు. మూడు పర్యాయాలు ఇంపీరియల్‌ లేజిస్లేసివ్‌ కౌన్సిల్‌ సభ్యునిగా రాజావారు ఎంపికయ్యారు. విద్యాపోషకుడైన మూడో విజయరామగజపతి 1857లో మాధ్యమిక పాఠశాల ఏర్పాటు చేశారు. అది క్రమంగా కళాశాలగా స్థాయి పెరిగి నేడు సరస్వతి నిలయంగా విరాజిల్లుతోంది. 1860లో సంస్కృత పాఠశాల, వేదపాఠశాలను మహారాజు నెలకొల్పారు. చెన్నపురి, కాశీ తదితర ప్రాంతాల్లో స్త్రీ విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈయన రాజనీతి వల్ల సంస్థానం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది.

మూడో విజయరామగజపతి తర్వాత 1879లో ఆయన ద్వితీయ పుత్రుడు మూడో ఆనందగజపతి ప్రభువయ్యారు. అభినవ ఆంధ్రభోజునిగా కీర్తిగాంచారు. ఇరవై భాషల్లో పరిచయం ఉన్న ఆయన శాస్త్రసాహిత్యాలు, సంగీతం, ఆశ్వారోహరాది విద్యల్లో ప్రావీణ్యులు. శాస్త్ర చర్చలతో, సంగీత సదస్సులతో, సాహితీ గోష్ఠులతో, సమస్యాపూరణాధికాలతో సభామండపం ప్రవర్థిల్లింది. మూడో ఆనందగజపతి కాలంలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాసన్నపేట కొండల సమీపాన స్థలం కేటాయించినప్పటికీ ఆయన అకాల మరణంతో కార్యరూపం దాల్చలేదు.

ఆనందగజపతి భార్య ప్రసవవేదనతో మరణించడంతో అలక రాజేశ్వరి సోదరుని రెండో కుమారుడు విజయరామసింగ్‌ను దత్తు స్వీకరించారు. దత్తత నామం నాలుగో విజయరామగజపతి. 1904లో విజయనగర సంస్థానానికి ప్రభువైన ఈయన 1919లో సంగీత కళాశాల స్థాపించారు. కోరుకొండ భవనం, సంస్కృత కళాశాల భవనం నిర్మించారు.

నాలుగో విజయరామగజపతికి అనారోగ్యం, దృష్టిమాంధ్యం సంభవించడంతో జ్యేష్ఠపుత్రుడైన అలకనారాయణ గజపతి 1920 నుంచి రాజ్యభారం వహించారు. 1922లో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. మద్రాసులో విమాన శిక్షణ పొంది సొంత విమానం నడిపేవారు. ఆత్మాభిమాని, స్వాతంత్రపిపాసి, ఆత్మవిశ్వాసం గల ఈయన బ్రిటిషు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులను లెక్కచేసేవారు కాదు. దీంతో బ్రిటిషు ప్రభుత్వం విజయనగరానికి సంరక్షణ రాజ్యసభను నియమించింది. దీనిపై అలకనారాయణ గజపతి విశాఖపట్నం జిల్లా కోర్డులో దావా వేసి స్వయంగా వాదించారు. చివరకు ఉభయ పక్షాలవారు రాజీకి వచ్చారు.

1937 ఫిబ్రవరిలో విజనగరం జనరల్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అలక నారాయణగజపతి పోటీ చేసి మద్రాసు లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే ఏడాది అక్టోబరు 20న మద్రాసులోనే మేడపైనుంచి జారిపడి మృతిచెందారు. ప్రత్యేక రైలులో భౌతికకాయాన్ని విజయనగరానికి తీసుకొచ్చి పెద్దచెరువు గట్టునున్న పూలతోటలో దహస సంస్కారాలు నిర్వహించారు.

మహారాజు అలక నారాయణ గజపతి జ్యేష్ఠపుత్రుడు అయిదో విజయరామగజపతి (పి.వి.జి.రాజు). 1935 నుంచి 1945 వరకు విజయనగరం సంస్థానం కోర్డు ఆఫ్‌ వార్డు ఆధీనంలో ఉంది. ఆ తర్వాత 1945లో తన 21వ ఏట అయిదో విజయరామగజపతి పట్టిభిషిక్తులయ్యారు. ఈయన ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ, విద్యాశాఖ మాత్యులుగా వ్యవహరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫ్రోఛాన్సలర్‌ పదవిని నిర్వహించి మార్గదర్శకులయ్యారు.


సేకరణ:- తరంగిణి శృంగవరపుకోట . 

తెలుగువెలుగు మాస పత్రిక నుండి


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!