🔻ఋష్యశృంగుడు-శృంగగిరి పీఠం.🔻

🔻ఋష్యశృంగుడు-శృంగగిరి పీఠం.🔻


🚩శ్రీ రామ చంద్ర మూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషిసల్పినటువంటి వ్యక్తి,


గొప్ప తపోధనుడూ ఋష్యశృంగుడు. 🙏🏿


ఆయన సాక్ష్యాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే... ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెళితే, ఆ శృంగేరిలో "కిగ్గా" అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది.🙏🏿


ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది ఆయన శివ స్వరూపంగా, శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరీ ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి.


గొప్ప తపో భూమీ అందుకే శృంగేరీ పీఠాన్ని అధిష్టించినటువంటి ప్రతి పీఠాధిపతికూడా తనదైన ముద్రవేశారు.🙏🏿


ఆశేతుహిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి, ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే... వారు ఎన్నో విషయాలను అందించీ మన జీవితాన్ని సార్దకతచేసిన మహాపురుషులు ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు.🙏🏿


చంద్ర శేఖర భారతీ నిరంతరమూ బ్రాహ్మీభూత స్థితియందు ఉండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొ శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటు పద్దతి కానీ అందరూ మహానుభావులూ ఈ జాతిని ప్రచోదనం చేసినవారే. 🙏🏿


దానికంతటికి కారణం ఎక్కటుందంటే మూలకందం ఎక్కడుందంటే... ఋష్యశృంగమహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావడం.


అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం.🙏🏿


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!