చదువు ‘కొనే’ కాలం 😍!

చదువు ‘కొనే’ కాలం 😍! 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 చదువు ‘కునే’ కాలం అయినా చదువు ‘కొనే’ కాలం అయినా అది ప్రతీ మనిషి జీవితం లో ఒక క్లిష్టమైన కాలం. మా కాలం లో ఒక 2 – 3 శాతం కొనే వాళ్ళున్నా మిగతా వాళ్ళంతా కునే వాళ్ళే. కొనే వాళ్ళు కూడా మరీ విచ్చలవిడిగా కొనే వాళ్ళు కాదు. రహస్యం గా పకడ్బందిగా అనుమానం రాకుండా కొనుక్కునే వారు. చదువు అనేది ఒక జబ్బు, అది పిల్లల తల్లి తండ్రులకి వస్తుంది ఈ జబ్బు కూడా విచిత్రమైనది. పిల్లలు కనిపిస్తే ఎక్కువయేది . "అల్లా అడ్డగాడిద లా తిరగక పొతే చదువుకో కూడదా" అని కేకలేసేవారు, కనిపిస్తే . అవసరమైతే తప్ప వారి ముఖ్యం గా తండ్రి కంట పడకుండా తిరిగేవారు. పిల్లలు వజ్రాలు, వాళ్ళని సాన బెట్టితే ప్రకాశించేస్తారు. వూళ్ళో కరంటు లేకపోయినా సమస్య ఉండదు అన్న అభిప్రాయం వాళ్ళది. ఈ సాన పెట్టడానికి బడిలో ఉపాధ్యాయులు అవిశ్రాంతంగా కృషి చేసేవారు. సాన పెట్టడం లో వారు సాధారణం గా సామ, దండోపాయాలనే ఉపయోగించేవారు. వారికి దాన, బేధ ఉపాయాలు ఆట్టే తెలియవు. సాన పెట్టడానికి గురువులు తమ తమ ఆయుధాలను పరమ పవిత్రం గా పూజించేవార...