భీమ జరాసంధుల పోరు .💥

భీమ జరాసంధుల పోరు .💥


(పోతన గారి భాగవతం కథ .)


-సీ.

పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు; 

మృగపతిద్వితయంబు వృషభయుగము 

పావకద్వయము దంతావళయుగళంబు; 

దలపడు వీఁక నుద్దండలీలఁ 

గదిసి యన్యోన్యభీకరగదాహతులను; 

గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ 

గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ; 

ణములను సింహచంక్రమణములను


తే. గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి 

కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి 

పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర 

ఘనగదాఘట్టనధ్వని గగనమగల.


💥💥💥💥


భీమ జరాసంధులు ఇద్దరు ఘోరంగా పోరుతున్నారు.


అది ఎలా ఉందంటే –రెండు పర్వతాలు,


రెండు సముద్రాలు, రెండు వృభాలు, రెండు అగ్నులు,


రెండు మదించిన ఏనుగులు ఒకదానితో ఒకటి


భయంకరంగా తలపడుతున్నట్లుగా ఉంది.


విజృంభించి సింహనాదాలు చేస్తున్నారు పై కెగురుతున్నారు,


భూమి పగిలిపోయేలా నేలపైకి దూకుతున్నారు,


ఒకళ్ళ నొకళ్ళు తోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు.


కుడి ఎడమలకు తిరుగుతున్నారు,


అతి భయంకరమైన వారి గదా ఘట్టనలకి


నిప్పురవ్వలు రాలుతున్నాయి,


ఆకాశం అదిరిపోతోంది..

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!