Friday, March 8, 2019

Saranam nee divya charanam | Mattilo Manikyam |1971

శరణం నీదివ్య చరణం, నీనామమే ఎంతో

మధురం శ్రీశేషాశైల వాసా, // శరణం //

భక్తుల బ్రోచే స్వామివి నీవే,

పేదల పాలిటి పెన్నిధి నీవే // భక్తుల //

సకలజీవులను చల్లగా చూసే

కరుణామయుడవు నీవే // శరణం //

త్రేతాయుగమున శ్రీరాముడివై

ద్వాపరమందున గోపాలునివై

అ అ ఆ అ అ అ ఆ...... త్రేతాయుగ..

ఈ యుగమందున వెంకటపతి వై..

భువిపై వెలసితి నీవే // శరణం //

నీఆలయమే శాంతికి నిలయం,

నిను సేవించే బ్రతుకే ధన్యం // నీఆలయమే.......

తిరుమలవాసా శ్రీవేంకటే శ

మాఇలావెలుపు నీవే  // శరణం //

భానుమతి గారి గాత్ర ఆమోగం ,  చక్కని

 సంగీతం.ధన్యవాదాలు.💐💐💐💐.

No comments:

Post a Comment