❤️🔻🙏🏿వినాయక పూజ కథ 🙏🏿🔻❤️

 

                         ❤️🔻🙏🏿వినాయక పూజ కథ 🙏🏿🔻❤️ 

#పార్వతీదేవి  నలుగుపిండితో సృష్టించిన బాలునికి బ్రహ్మ ప్రాణమిస్తాడు. గుమ్మం వద్ద కాపలా ఉంచిన బాలుని ఈశ్వరుడు  పొరపాటున వధించి, పార్వతీదేవి కోరికపై అతనికి గజముఖం అతికించి ప్రాణం పోసి గణాధిపత్యం ప్రసాదిస్తాడు.


పుట్టినరోజునాడు ఆనందంతో నృత్యం చేస్తున్నవినాయకుని  చూసి చంద్రుడు పరిహసించగా వినాయకుడు కోపంతో చంద్రుని ముఖం చూసినవారు నిందలపాలవుతారని శపమిస్తాడు. నారదునితో  సహా దేవతల ప్రార్ధనపై తన జన్మ దినం ఐన చవితినాడు తనని పూజించినవారికి చంద్రుని చూసినా నిందలు రావని, అలా పూజించేవారు చవితినాడు చంద్రుని చూస్తే నిందలపాలు కారని శాప పరిహారం తెలియచేస్తాడు.

ఆనాటినుంచి సమస్త లోకాలవారు వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) నాడు వినాయక పూజ చేసి తరిస్తుంటారు.




#ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు  వినాయక చవితినాడు పొరపాటున పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూస్తాడు. అపవాదు వస్తుందని భయపడుతున్న శ్రీ కృష్ణుని రుక్మిణి  స్వాంతన పలుకుతుంది. సత్రాజిత్తు సూర్య భగవానుని గూర్చి తపస్సు చేసి శమంతక మణిని వరం గా పొందుతాడు. సత్రాజిత్తు) కుమార్తె సత్యభామ  శ్రీ కృష్ణుని ప్రేమిస్తుంది. శ్రీ కృష్ణుడు ప్రజలకు ఉపయోగించడానికి శమంతక మణిని ఇమ్మని సత్రాజిత్తును కోరతాడు. సత్రాజిత్ అందుకు అంగీకరించక మణిని తన సోదరుడు ప్రసేనుడికి  ఇచ్చి దాచమంటాడు. అతని మిత్రుడు శతధన్వుడితోసత్యభామ వివాహం నిశ్చయిస్తాడు.

#మణిని ధరించి ప్రసేనుడు వేటకు వెళ్ళగా అక్కడ ఒక సింహం బారినపడి మరణిస్తాడు. జాంబవంతుడు సింహాన్ని వధించి మణిని తన కూతురు జాంబవతి కిస్తాడు. నిజం తెలియని సత్రాజిత్తు శ్రీ కృష్ణుడే మణిని అపహరించాడని నింద వేస్తాడు. దాన్ని పోగొట్టుకోవడానికి శ్రీ కృష్ణుడు అడివిలోకి వెళ్ళీ జాంబవంతుని గుహ ప్రవేశించి, అతడిని ఓడించి, శమంతకమణితోబాటుగా, జాంబవతిని పెళ్ళాడి ఆమెతో రాజ్యానికి వస్తాడు.Vinjamuri Venkata Apparao




#శ్రీ కృష్ణుడు సత్రాజిత్తుకు మణిని ఇవ్వగా, అతడు పశ్చాత్తాపంతో తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని వేడుకుంటాడు. సత్యా కృష్ణుల వివాహం జరుగుతుండగా శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి, మణిని అపహరించి పారిపోతుండగా, శ్రీ కృష్ణుడు అతడిని వెంటాడి సుదర్సన చక్రంతో సం హరిస్తాడు. సతులతో కలసి ద్వారక చేరి, వినాయకుని పూజ మరచినందున ఈ నిందలు కష్టాలు కలిగాయని శ్రీ కృష్ణుడు చెప్పగా అందరూ నాటినుంచి శ్రద్ధగా వినాయక చవితి జరుపుకుంటున్నారు .


🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩🔻

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!