🚩రేవతిని బలరాముల వివాహం .🌹

🚩రేవతిని బలరాముల వివాహం .🌹


(పోతన గారి భగవత కధ .)


💥💥💥💥


క.


ఆ వనజగర్భు పంపున


రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్


రేవతి యనియెడు కన్యను


భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్.


భావము:


పూర్వం రైవత మహారాజు బ్రహ్మదేవుడు చెప్పగా తన కూతురు రేవతిని


తీసుకొని వచ్చి బలరాముడి కిచ్చి పెళ్ళి చేసాడు. ఇంతకు ముందు


విన్నావు కదా ఈ వృత్తాంతం.


🚩పూర్వ వృత్తాంతం.


ఇప్పటి మన్వంతరము ఆరంభములో,


అనగా స్వాయంభువు మన్వంతరములోని


మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో -


సూర్యవంశపు రాజు కకుద్ముని (రైవతుడు .)కుమార్తె రేవతి అనే సుందరి.


ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన


వరు గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు


వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన సుమారు


20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి


ఉండవలసి వచ్చింది.


దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి,


"నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి.


కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు.


ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో


పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు


కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు.


అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి పెళ్ళిచేసాడు.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!