🚩నర్గిస్ దత్.🌹

🚩నర్గిస్ దత్.🌹


👉🏿జన్మ నామం ఫాతిమా రషీద్


జననం జూన్ 1, 1929


కోల్కతా, పశ్చిమ బెంగాల్, బ్రిటిష్ ఇండియా


మరణం మే 3, 1981 (వయస్సు 51)


బాంబే, మహారాష్ట్ర, భారతదేశం


క్రియాశీలక సంవత్సరాలు 1935, 1942 – 1967


భార్య/భర్త సునీల్ దత్ (1958 – 1981)


పిల్లలు సంజయ్ దత్


అంజు


ప్రియా దత్


ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు: మదర్ ఇండియా (1958)


👉🏿


నర్గిస్ దత్ (ఆంగ్లం :Nargis Dutt) (హిందీ: नर्गिस, ఉర్దూ: نرگس)


(జూన్ 11929 – మే 3, 1981), వెండితెర పేరైన నర్గిస్ తోనే ప్రసిద్ధి.,


[భారతీయ సినిమారంగ నటి. 1940 నుండి 1960 వరకూ ప్రస్థానం.


తన విజయవంతమైన కెరీర్ తో విమర్శకులు సైతం


అభినందించారు. అనేక కమర్షియల్ చిత్రాలలో పనిచేసింది.


ఈమె విజయంతమైన సినిమా మదర్ ఇండియా (1957),


అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడింది.


ఈ చిత్రంలో తనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు లభించింది.


1958 లో నర్గిస్ పెళ్ళి సునీల్ దత్ తో జరిగింది.


1967లో నటించిన రాత్ ఔర్ దిన్లో ఈమెకు జాతీయ


ఉత్తమనటి అవార్డు లభించింది.


నర్గిస్ అసలు పేరు ఫాతిమా రషీద్, అలహాబాదుకు చెందిన ముస్లిం-గాయని జద్దన్ బాయి మరియు తండ్రి హిందువు మోహ్‌యాల్ రావల్పిండికి చెందినవాడు.


నర్గిస్ అన్న అన్వర్ హుసేన్, హిందీ నటుడు.


ప్రస్థానం


నర్గిస్ తన కెరీర్ ను పసితనంలోనే ప్రారంభించింది. బాలనటిగా


1935 లో తలాషె హక్ తన ఆరవయేట నటించింది. ఈ చిత్రంలో


ఈమె పేరు బేబీ నర్గిస్, ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది.


ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించింది. తన 14వ యేట


మెహబూబ్ ఖాన్ సినిమా తక్దీర్ (1943) లో నటించింది.


ఈమె విజయవంతమైన హిందీ-ఉర్దూ సినిమాలు 1940 - 1950 ల


మధ్య విడుదలైన బర్సాత్ (1949), అందాజ్ (1949), ఆవారా


(1951), దీదార్ (1951), శ్రీ 420 (1955), మరియు చోరీ చోరీ (1956).


ఈమె చాలా సినిమాలు రాజ్‌కపూర్ మరియు దిలీప్ కుమార్ సరసన


నటించినవే.


తన ప్రసిద్ధిగాంచిన చిత్రం మెహబూబ్ ఖాన్ నిర్మించిన ఆస్కార్-


అవార్డుకు నామినేట్ చేయబడిన జానపద-కథ మదర్ ఇండియా


(1957). ఈ చిత్రంలో నటనకు ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు


తెచ్చిపెట్టింది. 1958లో సునీల్ దత్ తో వివాహమైన తరువాత నర్గిస్


సినిమాలలో నటించడం దాదాపు మానేసింది. తన ఆఖరు చిత్రం


1967 నాటి రాత్ ఔర్ దిన్, ఈ చిత్రం ఈమెకు జాతీయ ఉత్తమ నటి


బహుమతి తెచ్చి పెట్టింది.


మరణం


తరువాతి కాలంలో ఈమె పాంక్రియాటిక్ కేన్సర్ వ్యాధి బారిన పడింది.


1981 మే 2 కోమాలోకి వెళ్ళింది, 1981 మే 3 న మరణించింది.


పురస్కారాలు


1957 - ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డు, మదర్ ఇండియా


1958 - పద్మశ్రీ - పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి సినిమా వ్యక్తి.


1968 - జాతీయ ఉత్తమనటి అవార్డు, రాత్ ఔర్ దిన్


ఊర్వశి అవార్డు.


కార్లోవి వేరీ అవార్డు సాధించిన తొలి నటి. ఈమె రాజ్యసభకు నామినేట్ చేయబడింది. (1980-81),


జాతీయ సినిమాటోగ్రఫీ అవార్డు. భారతీయ సినిమాకు విశిష్ట సేవలందించినందుకు గాను.


🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿🚩👏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!