🚩పెద్ద మనుషులు (అపురూప చిత్రాలు)🌹

🚩పెద్ద మనుషులు (అపురూప చిత్రాలు)🌹


👉🏿👉🏿👉🏿👉🏿👉🏿👉🏿


సంఘంలో ‘పెద్దమనుషులు’గా చెలామణి అయ్యేవారు ఇతరత్రా ఎలా ప్రవర్తిస్తారన్నది ప్రాతిపదిక. ఒక ఊళ్ళోని మున్సిపాలిటీ- చైర్మన్, కౌన్సిలర్లు- కౌన్సిలర్లలో దేవాలయం పూజారి, పత్రికా సంపాదకుడు కూడా వుంటాడు. పత్రికా సంపాదకుడు తప్ప తక్కిన వాళ్ళంతా పెద్దమనుషులే. వీళ్లంతా ఆ వూళ్ళోని ఆలయానికి ధర్మకర్తలు కూడా. అలాగే వీళ్ళు అనాథ శరణాలయం కూడా నడుపుతూ వుంటారు. వీళ్ళు ఆ పదవులు నిర్వహిస్తూ స్వార్థానే్న చూసుకుంటూ వుంటారు. ఇలాంటి పెద్ద మనుషులు గుడిలోని లింగానే్న కాకుండా గుడిని కూడా మింగుతారని కథా సూత్రం. చివరికి గుడిలో ఏదో నిధి వుందని ఆ నిధిని అంతా కలిసి సంగ్రహించాలని పన్నాగం పన్ని ‘మరమ్మతుల కోసం గుడిని మూసేస్తున్నాం’ అని ప్రజలకు చెప్పి రాత్రివేళల్లో గర్భగుడిలో తవ్వడం మొదలుపెడతారు. ఆ తవ్వడంలో పునాదులు కదిలి, గుడి కూలిపోతుంది. వాళ్ళంతా మరణిస్తారు. సంఘంలో పెద్దమనుషులనిపించుకున్న వాళ్ళ నిజరూపాలు, చివరికి ప్రజలకు అలా అర్థమవుతాయి.


కె.వి.రెడ్డిగారు అంతకుముందు తీసిన నాలుగు చిత్రాల్లో రెండు జీవిత కథలు (పోతన, వేమన), రెండు జానపదాలూ (గుణసుందరి కథ, పాతాళభైరవి) కావడంలో ఈసారి సాంఘిక చిత్రం తీయాలని ఆలోచించారు. సంఘంలో పెద్దలు అనిపించుకుంటున్న వాళ్లలో వుండే ‘కుళ్ళు’ను వ్యంగ్య ధోరణిలో చెప్పడం కూడా సాంఘిక ప్రయోజనం కాగలదని ఆ ధోరణిలో కథ ఆలోచించసాగారు. కె.వి.రెడ్డి. తాను అనుకున్న కథా వస్తువు డి.వి.నరసరాజుతో చెప్పడం జరిగింది. ఆ ధోరణికి దగ్గరగా వుంటుందేమోనని ఇబ్సెన్ రాసిన ‘పిల్లర్ ఆఫ్ సొసైటీ’ నాటకం ఆధారంగా ‘పెద్దమనుషులు’ చిత్రానికి రాజుగారు స్క్రిప్టు రాశారు.


చిత్రంలో ముఖ్యమైన పాత్ర చైర్మన్‌ది. ఆ పాత్రని ముందు యస్.వి.రంగారావు చేత వేయించాలని అనుకున్నారు గానీ, కొన్ని కారణాలవల్ల గౌరీనాథ శాస్ర్తీ చేత వేయించారు. అది ‘హీరో’ చిత్రం కాదు. ‘‘కథ, పాత్రలు సంభాషణలే మన హీరో’’ అనేవారు కె.వి.


ఇందులో వ్యంగ్య ధోరణిలో మూడు పాటలను కొసరాజుతో కె.విగారు వ్రాయించారు. ‘నందామయా గురుడ నందామయా’, ‘శివ శివ మూర్తివి గణనాథా’, ‘పట్నమెళ్ళగలవా’ అన్న మూడు పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. తక్కిన పాటలు ఊటుకూరి సత్యనారాయణరావు రాశారు.


‘పెద్దమనుషులు’ చిత్ర కథ ఏమిటంటే- సంఘంలో ‘పెద్దమనుషులు’గా చెలామణి అయ్యేవారు ఇతరత్రా ఎలా ప్రవర్తిస్తారన్నది ప్రాతిపదిక. ఒక ఊళ్ళోని మున్సిపాలిటీ- చైర్మన్, కౌన్సిలర్లు- కౌన్సిలర్లలో దేవాలయం పూజారి, పత్రికా సంపాదకుడు కూడా వుంటాడు. పత్రికా సంపాదకుడు తప్ప తక్కిన వాళ్ళంతా పెద్దమనుషులే. వీళ్లంతా ఆ వూళ్ళోని ఆలయానికి ధర్మకర్తలు కూడా. అలాగే వీళ్ళు అనాథ శరణాలయం కూడా నడుపుతూ వుంటారు. వీళ్ళు ఆ పదవులు నిర్వహిస్తూ స్వార్థానే్న చూసుకుంటూ వుంటారు. ఇలాంటి పెద్ద మనుషులు గుడిలోని లింగానే్న కాకుండా గుడిని కూడా మింగుతారని కథా సూత్రం. చివరికి గుడిలో ఏదో నిధి వుందని ఆ నిధిని అంతా కలిసి సంగ్రహించాలని పన్నాగం పన్ని ‘మరమ్మతుల కోసం గుడిని మూసేస్తున్నాం’ అని ప్రజలకు చెప్పి రాత్రివేళల్లో గర్భగుడిలో తవ్వడం మొదలుపెడతారు. ఆ తవ్వడంలో పునాదులు కదిలి, గుడి కూలిపోతుంది. వాళ్ళంతా మరణిస్తారు. సంఘంలో పెద్దమనుషులనిపించుకున్న వాళ్ళ నిజరూపాలు, చివరికి ప్రజలకు అలా అర్థమవుతాయి.


ఇందులో ‘పెద్దమనుషులు’ చేసే దర్వ్యాసారం అంతా ఎప్పటికప్పుడు వ్యంగ్య ధోరణిలో వివరించడానికి ‘తిక్క శంకరయ్య’ పాత్రని సృష్టించారు. ఈ పాత్రని రేలంగి చాలా అద్భుతంగా నిర్వహించారు. అలాగే అంతవరకూ హాస్యపాత్రలు, దుష్టపాత్రలు ధరించిన లింగమూర్తి ఎంతో మంచివాడైన పత్రికా సంపాదకుడిగా చాలా గొప్పగా నటించారు. 1952లో పెద్దమనుషులు షూటింగ్ రేవతి స్టూడియోలో ఆరంభమైంది. తర్వాత షూటింగ్ అంతా ‘వాహిని’లోనే జరిగింది. ఈ చిత్రం 1954 మార్చి 11న విడుదలైంది.


1954లో ఉత్తమ చిత్రాలకు రాష్టప్రతి బహుమతులు ప్రవేశపెట్టినపుడు ఆ సంవత్సరపు ఉత్తమ తెలుగు చిత్రంగా వాహినివారి ‘పెద్దమనుషులు’ ఎన్నికై రజతపతకం పొందింది.


నట వర్గం: జంధ్యాల గౌరీనాథశాస్ర్తీ, రామచంద్ర కాశ్యప, ముదిగొండ లింగమూర్తి, రేలంగి వెంకట్రామయ్య, ఎ.వి.సుబ్బారావు, చదలవాడ కుటుంబరావు, వంగర వెంకట సుబ్బయ్య, జూనియర్ శ్రీరంజని, డి.హేమలత, శేషమాంబ, స్వరాజ్యలక్ష్మి, కొమ్మూరి పద్మావతి.


సాంకేతిక వర్గం: రచన: డి.వి.నరసరాజు, సంగీతం: ఓగిరాల రామచంద్రరావు, పాటలు: కొసరాజు, ఊటుకూరి, కెమెరా: బి.యన్.కొండారెడ్డి, కళ: ఎ.కె.శేఖర్, నాట్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కూర్పు: యమ్.యస్.మణి, స్టూడియో: వాహినీ, రేవతి, నిర్మాత, దర్శకుడు: కె.వి.రెడ్డి


👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!