🚩🚩🙏🏿*శ్రీరాముని కాల వివరణ* :-🙏🏿🚩🚩

🚩🚩🙏🏿*శ్రీరాముని కాల వివరణ* :-🙏🏿🚩🚩


💥💥💥💥💥💥--సేకరణ .--💥💥💥💥💥


ఈమధ్యకాలంలో శ్రీరాముడు మళ్ళీ వార్తలలో నిలిచాడు. అన్నీ అడ్డంకులు తొలగి భారతీయుల చిరకాల కోరిక అయిన అయోధ్య లో భవ్యరామమందిరం నిర్మాణం కల సాకార మవుతున్నవేళ


ఆ శ్రీరాముని #జన్మాదివిశేషాలను మీతో పంచుకోవాలనిపించింది.


శ్రీరాముని జన్మలగ్నం:- (సంస్కృతమున)


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


తతోయజ్ఞే సమాప్తే తృతూణామ్ షట్ సమత్యాహుః|


తత్చ ద్వాదశే మాసే చైత్ర నవమికే తిథు ||


నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉఛ్ఛ సంస్థేషు పంచాసు |


గ్రహేషు కర్కాటకే లగ్నే వాక్పటిందునా సహ ||


ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం |


కౌసల్యాజనయాత్ రామం సర్వలక్షణ సంయుతం ||


🔍 📖 రా .బాలకాండ.18వసర్గ 8-11. 📖🔍


(#ఆంధ్రీకరణ)


క్రతువు పరిపూర్తి యగుడు౯ ఋతుషట్కం


బరుగ¢ బదియు రెండవ నెలలో |


క్షితి¢చైత్ర శుధ్ధనవమి నృదితి తారను


రవియు నడిమిందివిని వెలుగన్ ||


వరకట్న లగ్నంబున సురగురుడు


దయుంచు చుండ సోముని తోడన్౯ |


ధరణి ముఖగ్రహ పంచక మరుదుగ


స్పోఛ్ఛ స్థలంబు లందు వెలుంగన్ ||


కౌసల్య జగత్పతి శ్రీ వాసుని యర్థాంశ


మూర్తి వరశుభ బిహ్నున్౯ |


భాసురఘకులవర్థను వాసి¢గనె౯


సర్వలోకనందితు రామున్. ||


#విశేషార్థములు:-


పుత్రకామేష్ఠి యాగం బహుశా చైత్రమాసం నందు అయిఉండవచ్చు.


ఆపైన ఆరు ఋతువులు అనగా వసంతం నుండి శిశిరం వరకు 12 నెలలు. వైశాఖమునకు 12వమాసం చైత్రమాసం.


దేవతల తల్లి అయిన అదితి👸 పునర్వసు నక్షత్రానికి ⭐ అధిదేవత.


(పునర్వసు నక్షత్రమదితిర్దేవతా - శృతి)


చైత్రమాసం లో పునర్వసు నక్షత్రం శుక్లపక్షం లో వస్తుంది కనుక ఇది #శుక్లపక్షం.


సూర్యుడు ఆకాశమందు ప్రకాశించుచుండగా అనగా #అభిజిత్ #ముహూర్తం అని భావము.


లగ్నే కర్కాటకే ప్రాప్తే జన్మ రామస్యచ స్థితే -


అయోధ్యకాండ 15వ సర్గ 3


అనుసరించి కర్కాటక లగ్నమున


1️⃣ బృహస్పతి 🌕 - కర్కాటకమందు 🦀


2️⃣ చంద్రుడు 🌝 - కర్కాటకమందు 🦀


3️⃣ సూర్యుడు 🌞 - మేషమందు 🐏


4️⃣ శుక్రుడు 🌔 - మీనమందు 🐟


5️⃣ కుజుడు 🌒 - మకరమందు 🐊


ఉఛ్ఛ స్థితిలో 🔝 ఉండగ


రాముడు జన్మించెనని 🤰👶 వివరణ.


#తాత్పర్యము:-


యజ్ఞము సాంతము కాగా ఆరు ఋతువులు గడచిన తర్వాత పన్నెండవ నెలలో చైత్రమాసమున శుధ్ధ పక్షమున నవమి తిథి యందు అదితి అధిదేవతగా కల (పునర్వసు) నక్షత్రమునందు సూర్యుడు ఆకాశంలో ప్రకాశించుచుండగా (అభిజిత్ లగ్నంలో)


కర్కాటకమందు బృహస్పతి చంద్రునితో కూడి తక్కిన సూర్యుడు , శుక్రుడు , కుజుడు ఉఛ్ఛస్థితి లో ఉండగా


కౌసల్యాదేవి జగత్కళ్యాణమూర్తి అగు


శ్రీ మహావిష్ణువు అర్థాంశ మూర్తియు


శుభలక్షణములు కలవాడునూ


రఘువంశ వర్థనుడునూ


సర్వలోకములు నమస్కరించు వాడైన


రామునికి జన్మనిచ్చెను.


↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️


వనవాస సమయానికి రామునివయసు 🤵 25


సీతవయసు 👰 18.


మాయావేషధారి అయిన


రావణునితో సీత ఈవిధంగా అంటుంది.


మమభర్తా మహాతేజా వయసాం పంచవింశకః


అష్టాదశహి వర్షాని మమ జన్మాని గణ్యతే ||


➖అరణ్యకాండ 47స 11శ్లో


↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️


14 సంవత్సర అరణ్యవాసం లో


శ్రీరామ వనవాసకాలం


శ్రీరామ వనవాసకాలం


"""""""""""""""""""""""""


1వ రోజున చైత్ర శుద్ధ దశమినాడు వనవాసప్రయాణము.


రాత్రి తమసాతీర వాసము.


2వ రోజున జాహ్నవీ తీరవాసము - గుహుని రాక.


3వ రోజున గంగాదక్షిణ తీర తరువు క్రింద వుండుట.


4వ రోజున ప్రయాగలో వుండుట,భరద్వాజ దర్శనము.


5వ రోజున యమునాతీర వాసము,చిత్రకూట ప్రవెశము.


6వ రొజున సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట,రాత్రికి దశరధుని మృత్యువు.


7వ రొజున కౌసల్యాదుల విలాపము భరతునికై దూతలను పంపుట.


8వ రొజునుండి 12వ రోజువరకు భరతుని అయోధ్యా ప్రయాణము.


13వరొజున పౌరలౌకిక కర్మ.


14వరొజున నుండి 17వ రోజువరకు వనమార్గము బాగు చేయుట.


18వరొజునుండి 20వ రోజువరకు భరతుని వన ప్రయాణము.


21వరొజూనుండి 23వరోజువరకు భరతుడు రాముని వద్ద నుండుట.


24వరోజునుండి 27వ రొజూవరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో వచ్చుట.


45వ రొజున పాదుకా పట్టాభిషేకము.


శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను.


మొదటి సంవత్సరము ఇట్లు గడిచెను.


పిదప చిత్రకూటము విడచి దండాకారణ్యమున ప్రవేశించి


ఋషుల ఆశ్రమములను చూచుచూ గడిపినవి 10సంవత్సరములు.


పిదప పంచవటిలో ఓకటిన్నరసంవత్సరములు గడిపేను.


ఈ విధముగా 12.5 సంవత్సరములు పూర్తి అయ్యెను.


13వ సంవత్సరము కొంచము మిగిలి వుందనగా మాఘశుద్ధ అష్టమినాడు #విందము అన్న ముహుర్తములో రావణుడు సీతను అపహరించినాడు.


* జ్యేష్ట శుద్ధ పౌర్ణమి వాలి వధ.


* కార్తీక్ శుక్ల పాడ్యమి వరకు సుగ్రీవ పట్టాభిషేకము.


* 4మాసములు వర్షాకాలము సీతా అన్వేషణ జరుగలేదు.


* కార్తీకము చివర లక్ష్మణ ఆగ్రహము, అక్కడి నుండి మార్గ శిర్షము వరకు సీతాన్వేషణ.


* హనుమంతుడు మార్గశిర శుద్ధ ఏకాదశిన లంకా ప్రవేశము.అర్ధరాత్రిన సీతా దర్శనము.


* ద్వాదశినాడు వృక్షము పైనుంచి రావణుని చూడటము.


సీతతో సంభాషణ.


* త్రయోదశీనాడు అక్షాది వధ.


* చతుర్దశినాడు లంకా దహనము.


* మరలా వానరులతో కలయకకు 5 రోజులు.


* మార్గశిర శుక్ల షష్టినాడు మధువన భంజనము.


* అష్టమినాడు ఉత్తర నక్షత్రమున విజయాఖ్య ముహుర్తమున రామ దండు ప్రస్థానము.


* పుష్య పాడ్యమికి సముద్ర తీరమునకు చేరుట.


* పుష్య శుక్ల చవితీకి విభిషుణుడు రాక.


* పంచమికి సముద్రముదాటుటకై అలోచన


* పిదప 4 దినములు సముద్రుని రాముడు ప్రార్ధించుట,


పిదప ప్రాయోప్రవేశమునకు యత్నము.


* దశమికి సేతుబంధన ప్రారంభము.


* త్రయోదశికి సేతుబంధనము పూర్తి.


* చతుర్దశికి రాముడు సువేలగిరిని నెక్కుట.


* పుష్య పౌర్ణమి నుండి బహుళ విదియ వరకు సైన్యము దాటుట.


* తదియ నుండి దశమివరకు సేనా నివేశము


* ఏకాదశిన రావణ అదేశముపై శుకసారణులు వచ్చి రామసేనను చూచుట.


* ద్వాదశి వానరసేన గణనము


* అమావాస్య రాక్షసేన గణనము.


* మాఘ శుద్ధ పాడ్యమి అంగద రాయభారము.


* విదియ నుండి అష్టమి వరకు వానర రాక్షస యుద్ధము.


* నవమిరాత్రి ఇంద్రజిత్ నాగాస్త్రముచే రామలక్ష్మణులను బంధించుట.


* దశమీ గరుత్మంతుని ఆగమనము నాగపాశవిమోచనము.


* ఏకాదశి,ద్వాదశిలలొ ధుమ్రాక్షవధ,


* త్రయోదశినాడు అకంపన వధ.


* చతుర్దశినుండి బహుళ పాడ్యమి వరకు యుద్ధము నీలుడు ప్రహస్తుని చంపుట,రాముడు రావణుని మకుటభంగము.


* పంచమి నుంచి చతుర్దశివరకు కుంభకర్ణునితో యుద్ధము.


* అమావాస్య యుద్ధ విరామము.


* ఫాల్గుణ పాడ్యమి నుంచి చవితివరకు నరాంతక వధ.


* పంచమి నుంచి సప్తమి వరకు అతికాయుని వధ.


* అష్టమి నుంచి ద్వాదశి వరకు కుంభ,నికుంభుల వధ.


* పిదప మూడురొజులు మకరాక్షవధ.


* ఫాల్గున శుద్ధ విదియ ఇంద్రజిత్ యుద్ధము.


* తదియనుంచి సప్తమి వరకు యుద్ధ విరామము.


* త్రయోదశినాడు ఇంద్రజిత్ వధ.


* చతుర్దశి యుద్ధ విరామము.


* ఫాల్గున అమావాస్య రావణుని యుద్ధ యాత్ర.


* చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి రామ రావణ యుద్ధము.


* నవమి రావణపలాయనము.


లక్ష్మణ మూర్చ సంజీవిని తెచ్చుట.


* దశమి యుద్ధ విరామము.


* ఏకాదశి ఇంద్రుడు రామునకు రధము పంపుట.


* ద్వాదశినుంచి బహుళ చతుర్దశి వరకు 18 రోజులు


రామ రావణ యుద్ధము.


* చతుర్దశి రావణ వధ.


* అమావాస్య రావణునికి సంస్కారము.


* మొత్తము 18రోజుల విరామము,72 రోజుల యుద్ధము.


* వైశాఖ శుద్ధ పాడ్యమి విభీషుణుని పట్టాభిషేకము.


* తదీయ సీత అగ్నీ ప్రవేశము.


* చవితీ పుష్పక విమానము ఎక్కి భరద్వాజ ఆశ్రమమునకు రాక.


* షష్టి నంది గ్రామములో భరతుని కలియుట.


* వైశాఖ శుద్ధ నవమి శ్రీరామ పట్టాభిషేకము.


రావణ సంహారం అనంతరం శ్రీరామ పట్టాభిషేకం.


.


.


రాముడు జన్మించి ఎన్ని సంవత్సరాల కాలం అయిందో చిన్న అంచనా ⁉️ 🤔😲


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


మనం ప్రస్తుతం


1⃣మొదటిదైన శ్వేతవరహ కల్పం లోని


7⃣ఏడవదైన వైవస్వత మన్వంతరం లోని


2⃣8⃣వ మహాయుగం లోని


కలియుగం లో 5,121 వ సంలో (2019 నాటికి ) వున్నాం.


*శ్రీరాముని కాల వివరణ* :-


〰️〰️〰️〰️〰️〰️〰️〰️


శ్రీరాముని జీవితకాలం గురించి పూర్తి స్థాయి లో సమాచారం దొరకనప్పటికిని


...... *వాల్మీకిరామాయణం బాలకాండ* .... లోని


ఈ క్రింది శ్లోకం ద్వారా కొంతవరకు వివరించవచ్చు.


దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ|


రామోరాజ్యం ఉపసితాచ బ్రహ్మలోకం ప్రయాస్యతి ||


రా.బాలకాండ 1-1-97


అనగా 1️⃣1️⃣,0️⃣0️⃣0️⃣ సం రాజ్యపాలనం చేసి బ్రహ్మలోకానికి చేరాడు అని చెప్తారు.


➖➖✴❇➖➖✴❇


.


....రాముడు 11,053 సం. జీవించినట్లు చెప్తారు...


.


24వ చతుర్యుగం లో త్రేతాయుగం లో చివరి 11,053 సం


రాముని జీవిత కాలము (అనుకుంటే)


➖➖➖➖➖➖➖➖➖➖➖➖


తరువాత ద్వాపరయుగం ప్రారంభం అవుతుంది.


ఈ విధం గా *24 వ చతుర్యుగం* లో


రాముని వయసు


త్రేతాయుగం లో 11,053 సం


ద్వాపరయుగం 8,64,000


కలియుగం 4,32,000


25 వ 43,20,000


26 వ 43,20,000


27 వ 43,20,000


✨28 వ చతుర్యుగం లో


కృతయుగం 17,28,000


త్రేతాయుగం 12,96,000


ద్వాపర యుగం 8,64,000


అక్కడినుండి


కలియుగం ప్రారంభం


2019నాటికి 5,121


❇✴➖➖❇✴➖➖


మొత్తం కలిపితే


శ్రీరాముడు జన్మించి 2019 నాటికి 1⃣,8⃣1⃣,6⃣0⃣,1⃣7⃣4️⃣ సం గా చెప్పవచ్చు.


వీనికి మరలా ✡️యుగసంధి కాలాలు , ✡️ప్రళయ కాలాలు కలపవలసి ఉంటుంది.


ఇన్ని సంవత్సరాల నుండి శ్రీరాముని ఆరాధిస్తున్నామంటే కేవలం


#రామో #విగ్రహాన్ #ధర్మః


ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడే.


#ఉపసంహారం :-


పవిత్ర రామజన్మభూమి యందు రామాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటూ


🚩🚩 🙏 జైశ్రీరామ్ 🙏 🚩🚩

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!