🚩జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది!!🌹

🚩జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది!!🌹


👉🏿విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)


కనుక జగమంతకుటుంబం నాది .


👉🏿👉🏿విశ్వం నాలో లీనం (లయం )అయినపుడు


నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితంనాది .


(ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం.


భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం.)


శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!🙏🏿🙏🏿


.💦💦💦💦💦💦💦💦💦


జగమంతకుటుంబంపాట:--


పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది


సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే


చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై


మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో


పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల


నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ


ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం


కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని


కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత//


శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన


ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ


' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో


తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా


మార్చేసారు .


కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే .


1+1 × 1-1 = 1


రెండు ఒకటి


( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1


పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 × 1-1) విడిపోయింది .


రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా


అనేకం(X+1 × X-1) గా మారిపోయింది .


(X) స్థానంలో ఏ సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు .


సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా


మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి


ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం


'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది


శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది


( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1


జగమంతకుటుంబం ఏకాకిజీవితం నేను(నాది)


జగమంతకుటుంబం : (X+1 × X-1) లో X బదులుగా (కవి ×కవిత),


(భర్త × భార్య),(భగవంతుడు × భక్తుడు) ....ఇలా ఒకరికొకరు వరసైన


జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ


ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే,


ఏమాటకామాటే . ఒక వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది


పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని


విడివిడిగా గుర్తించడమే సామరస్యం .


(2+1 × 3-1) ≠ 1


ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు


(≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లేకపోతే


అతడు ‘వ్యక్తి’ కాలేడు .‘వ్యక్తి’త్వ లోపం


వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది .


ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి


పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది.


మనోవాక్కయకర్మలలో ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.


2 +1 × 2 –1 = 1


3 +1 × 3 –1 = 1


ఫై సమీకరణాలు రెండింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది


.కానీ రెండు సమీకరణాలు ఒకలా లేవు. భిన్నంగా ఉన్నాయి .


అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు .


ఉదాహరణకు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో


లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం -ఉంది .


కానీ ఇద్దరి జీవితమార్గాలు ఒకలాలేవు . విలక్షణంగా ఉన్నాయి.


కారణం వారు ఏకత్వానికి,చిత్తశుద్దికి ప్రాధాన్యత


యిచ్చి,అలావుండడానికి నిరంతర సాధన చెయ్యడం వల్ల


ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా దానంతట


అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ


వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు .


అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా


పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది


స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో


ఏకత్వాన్ని (integrity)పోగొట్టి అస్థిత్వాన్నే భంగపరుస్తుంది.అస్తిత్వంతో


ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు


,స్వేఛ్చ సిద్ధిస్తాయి . “Is it true?” అని కాక “Is it true for me?”


అనేది ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది .


ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది’ అనుకునేవాడికి


ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు ఏ


వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి,


సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు


. అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం .


నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1 విస్తృత రూపం దాల్చి


(X+1 × X-1) అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం


స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను'


ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను .


ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .


1 లో ( X+1 × X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు ,


ఏకాకి లో విశ్వం ఇమిడి వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి


యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు .


విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక


జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం )


అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం


నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో


ఏకత్వం ఏకాకిజీవితం.


ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా


............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా


మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే


మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే .


నరుడే నారాయణుడు .


నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా ఉన్నపుడు


పాడుకోవడానికి ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు


కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు


పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'


ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు


పార్శ్వాలని అద్వైతతత్వ సారాంశం.మనిషి ఏ పార్శ్వంలో


ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని,దాని విలు


వను గుర్తించగలడు .


లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి


ఆ రెండిట్లో ఏ ఒక్కటీ, ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు .


అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది .


ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది .


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!