🚩రాయని భాస్కరుడు -హుళక్కి భాస్కరుడు🌹

🚩రాయని భాస్కరుడు -హుళక్కి భాస్కరుడు🌹


(యేదో రాయలని మొదలు ..యేది రాయలేక దిగులు)


💥👉🏿


భాస్కరుఁ డనెడి యీ కవి రామాయణము పద్యకావ్యముగా


తెనిఁగింపc బడుటకు ముఖ్యకారకుఁడు.


తిక్కనసోమయాజుల పితామహుఁడును. గుంటూరిసీమకు


పాలకుఁడు నగు మంత్రి భాస్కరునిచే రామాయణ మంతయు


తెనిఁగింపఁబడినదనియు, ఆది యే హేతువు చేతనో యొక్క


యారణ్యపర్వము తప్పఁ దక్కినభాగ మంతయు నుత్సన్నము కాఁగా


పిమ్మట హుళక్కి భాస్కరుఁడు మొదలయినవారు తక్కిన కాండములను


మరల రచించి గ్రంధపూర్తి చేసిరనియు ఒక ప్రతీతి కలదు.


ఈ రామాయణమునకు భాస్కరరామాయణ మన్న పేరు


మంత్రిభాస్కరునిచేత నయినను, హుళక్కి భాస్కరునిచేత నైనను


రావచ్చును: గాని, ఆరణ్య కాండము తక్కినకాండములవలెఁ గాక


యా శ్వాసములను కలిగి యుండుటను బట్టియు దాని శైలినిబట్టియు


విచారించి చూడఁగా భాస్కరరామాయణము లోని యారణ్యకాండము


మంత్రి భాస్కరునిచేతనే రచియింపఁబడినదేమో యని సందేహము


కలుగుచున్నది.


యుద్ధకాండములోని 1134 పద్యములను హుళక్కి భాస్కరుఁడు


రచియించినను, దాని నా శ్వాసములుఁగా విభాగింపకుండుటయు,


ఆరణ్యకాండ మంతటిలోను 830 పద్యములకంటె నెక్కువ


లేకపోయినను దానిని రెండాశ్వాసములుగా భాగించుటయు,


విచారింపఁగా నీ రెండు కాండములను రచియించినవా రొక్కరు


కారనియు వేఱువేఱు భాస్కరులనియు నూహింపఁదగి యున్నది.


యుద్ధకాండములోని "శ్రీయుత మూర్తియైన" యను పద్యము


మొదలుకొని వేదగిరినాయనింగారి ప్రేరణమువలన నయ్యలార్యునిచే


రచియింపఁబడినట్టు ప్రాచీన తాళపత్రసంపుటములలోఁ గొన్నిటిలో


వ్రాయఁబడియున్నది.


భాస్కరరామాయణ మంకితము చేయఁబడిన సాహిణిమారఁడు


బుద్ధరాజు కొమారుఁ డయిన ట్లయోధ్యాకాండములోని యీ


క్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.


క. 'శ్రీరమణీరమణసుధా


ధారాళదయాకటాక్షదామస్మితదృ


క్కైరవ వితరణకరణవి


శారద బుద్ధయకుమార ! సాహీణిమారా ! [ అయోఁ 1 ]


ఈ బుద్ధరాజునకు నవనాధుఁ డనియు పేరు గలదు.


సాహిణి మారన రాజయినట్లే క్రింది హుళక్కి భాస్కరుని చాటుధారను


బట్టి సులభముగా దెలిసికోవచ్చును.


క. అప్పు లిడునతఁడు ఘనుఁడా ?


యప్పు డొసఁగి మరలఁ జెందునాతఁడు రాజా ?


చెప్పఁగవలె సాహిణి మా


రప్పను దానమున ఘనుఁడు రాజు నటంచున్


మారన్న రాజనియు, సేనాధిపతి యనియు స్థాపించు పద్యములు


రామాయణములోనే యున్నవి.


క. శ్రీరామాకుచయుగళీ


హారిద్రోల్లసితవక్షహరిచరణసరో


జారాధ్యుఁడు మారయధర


ణీరమణోత్తముఁడు సాహిణీ తిలక మిలన్.


[ఆరణ్యకాండము, ఆ 2--]


శా. లాటీచందనచర్చ చోళ మహిళాలావణ్యసామగ్రి క


ర్ణాటీగీతకలాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా


వాటీమంజరి గౌడవామనయనావక్షోజహారాళియై


సాటింపందగు నీదుకీర్తి రథినీపాలాగ్రణీ! సాహిణీ !


[కిష్కింధాకొండము, 8-26]


.హుళక్కి భాస్కరుఁడు యుద్ధకాండమునందలి పూర్వభాగమును


రచియించిన ట్లయ్యలార్య ప్రణీతంబయిన యూ క్రిందిపద్యమువలన


నెఱుఁగవచ్చును.


చ. 'అమర హుళక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం


డమతరువాయి చెప్పె వికట ప్రతిభాషణుఁ డప్పనార్యస


త్తమసుతుఁ డయ్యలార్యుఁడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా


హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్."


[యుద్ధకాండము 2583]


ద్వితీయ ప్రతాపరుద్ర చక్రవర్తికాలములోను, దరువాతను


మహావిద్వాంసుఁడును మహాకవియు నయి హుళక్కిభాస్కరుఁడు


మిక్కిలి ప్రసిద్ధిచెందినవాఁడు. అందుచేత నాతవికిఁ గవులును,


పండితులును మిత్రులయి యుండుటయే కాక విద్యను, గవిత్వమును


నేర్చుకొనుచుండిన ఛాత్రులును పలువురుండి యుందురనుటకు


సందేహము లేదు. శ్రీనాధునికాలములో ననఁగా పదునాల్గవ


శతాబ్దాంతమునందును పదునైదవ శతాబ్దాదియcదును నుండిన


వల్లభామాత్యుఁడు తన క్రీడాభిరామమునందు


ఉ. "నన్నయభట్టతిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం


డన్నను జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్


నెన్నుదుటం గరాంజలులు నింతలు చేయనిరావితాపాటి తి


ప్పన్నయు నంతవాఁడె తగునా యిటుదోసపుమాట లాడఁగన్."


అని తనకంటె నేఁబదియఱువది సంవత్సరములు పూర్వమునం


దుండిన హుళక్కి భాస్కరుని నన్నయతి క్కనాదులతో సమానునిగాఁ


బొగడుటయే యాతని ప్రసిద్ధిని వేయినోళ్లఁ జాటుచున్నది.


👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!