💦💦💦💦🙏🏿 నేటి సుభాషితం 🙏🏿💦💦💦💦

💦💦💦💦🙏🏿 నేటి సుభాషితం 🙏🏿💦💦💦💦


🚩

కడచి పోయినట్టి క్షణము తిరిగిరాదు


కాలమూరకెపుడు గడుప బోకు


దీపమున్న యపుడే దిద్దుకోవలె నిల్లు


విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ!


🚩🚩

సిద్ధాంతములు లేని రాజకీయములు


దానధర్మములు లేని డబ్బు


సద్గుణములు లేని విద్య


మానవత్వము లేని విజ్ఞానము


త్యాగము లేని కర్మ యివన్నీ వ్యర్థములు.


🚩🚩🚩


విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?

బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:


👉🏿అర్థము:


విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు


కావలెనన్న యెట్లు దొరుకును?


మనుష్యుడు పాప మను బీజములు నాటి


(అంటే పాపకర్మలు చేసి) పుణ్యము,మోక్షము ఆశించిన


యెట్లు లభించును?ఎటువంటి విత్తనము


నాటితే అటువంటిఫలములే లభించును.


💦💦💦💦💦💦💦💦💦💦💦💦

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!