వేణీ సంహారం ....

వేణీసంహార నాటక కర్త ------------భట్ట నారాయణుడు

.

వేణీ సంహారం అంటే -


వేణి (ముడివేయడం) కొరకు సంహారం


వేణి వలన (జరిగిన కౌరవ) సంహారం


వేణి కి సంహారం (నివృత్తి)



భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది 




వేణీసంహార నాటకం మహా భారత ఇతి వృత్తం .  .

ఇందులో ఆరు  అంకాలున్నాయి .ప్రధమాం కం లో శ్రీకృష్ణుని కౌరవుల వద్దకు రాయ బారిగా ధర్మ రాజు పంపి సంధి చేయమని కోరటం భీమ ద్రౌపదులకు ఇష్టం ఉండదు .సహదేవుడు భీముడిని శాంత చిత్తుని చేస్తాడు .కాని నిండుసభలో పాండవ రాజ పత్నియైన ద్రౌపది  తీవ్ర అవమానం పొందటం హృదయ శల్యం గా భావించి భీముడిని రెచ్చ గొట్టే ప్రసంగం చేసి అతనిలోని పౌరుషాగ్నిని రగుల్గొల్పుతుంది .ఈ మాటలకు ఉద్రేకం, ఉత్తేజం పొందిన భీముడు తన గద తో దుర్యోధనుడి తొడలను విరుగ గొట్టి ,దుశ్శాసనుడి వక్షస్తలాన్ని చీల్చి రక్తం తాగి ,ఆ రక్తం తో తడిసిన చేతులతో ద్రౌపది కేశ పాశాన్ని ముడుస్తాను అని ఘోర ,భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపది దీనితో శాంతిస్తుంది .విఫలమైన సందిరాయబారం తో వికల మనస్కుడై కృష్ణుడు అప్పుడే తిరిగి వస్తాడు .ధర్మ రాజు ఇక గత్యంతరం లేక కురుక్షేత్ర సంగ్రామానికి పూనుకొనగా భీముడు రెట్టించిన ఉత్సాహం తో యుద్ధ భూమిలో ప్రవేశిస్తాడు .


రెండవ అంకం లో దుర్యోధనుడి భార్య భానుమతికి  నూరు పాములను ఒక ముంగిస చంపి నట్లు కల వచ్చి కీడు ను శంకించి కలవర పడుతుంది  .శాంతికోసం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంది .దుర్యోధనుడు వచ్చి భార్యను ఓదారుస్తాడు  .భార్య భర్తలు ప్రేమ సాగిస్తారు .జయద్రదుడి తల్లివచ్చి తనకొడుకును అర్జునుడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వార్త తెలియ జేస్తుంది .గాంధారీ పుత్రుడు యుద్ధానికి వెడతాడు .


మూడో అంకం లో ద్రుస్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపుతాడు .ఈ వార్త ద్రోణ సుతుడు ఆశ్వతామకు తెలిసి క్రోధం తో ఉడికి పోతుంటే మేన మామ కృపుడు ఊరడించి దుర్యోధనుడి దగ్గరకు తీసుకుకొని వెళ్లి మేనల్లుడిని సేనాపతిని చేయమంటాడు .అంతకు ముందే కర్ణుడిని చేస్తానని ఆతను మాట ఇచ్చానంటాడు .కర్ణ ఆశ్వత్థామల మధ్య తీవ్ర వాదోప వాదాలు నడుస్తాయి రాజు సమక్షం లోనే. కర్ణుడు బతికుండగా తాను  ఆయుధం దాల్చనని ప్రతిజ్ఞ చేస్తాడు ద్రోణ సుతుడు .ఇంతలో భీముడు దుస్శాసనుడిని చంపి వక్షస్థలం చీల్చి నెత్తురు తాగాడన్న వార్తా తెలుస్తుంది .


నాలుగో అంకం లో – కర్ణుడికొడుకు వృష సేనుడు చనిపోయాడని వార్తాహరుడు రాజుకు చెబుతాడు .రెట్టించిన కోపం తో ద్రుత రాష్ట్ర సుతుడు యుద్ధానికి సన్నద్ద మవుతాడు .ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు యుద్ధం వద్దని పాండవులతో సంధి ముద్దు అని హితం చెబుతారు .


ఐదో అంకం -లో భీముడు అర్జునుడు దుర్యోధనుడు ఎక్కడో దాక్కున్న సంగతి తెలిసి వెతుకుతూ ఉంటారు .భీముడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మంటాడు రాజు .కాని అర్జుండు కల్పించుకొని ఆపేస్తాడు .ధర్మ రాజు వీరిద్దరిని రమ్మన్న వార్త విని అన్నగారి దగ్గరకు వెళ్ళిపోతారు .అశ్వత్థామ వచ్చి రాజును కలుస్తాడు .


చివరిది అయిన ఆరవ అంకం –కౌరవ పక్షం లో అందరూ యుద్ధం లో చనిపోతారు .దుర్యోధనుడోక్కడే మిగిలాడు .ప్రాణ భీతితో ఒక సరస్సులో దాక్కుంటాడు రాజు .పసికట్టిన భీముడు సరస్సు సమీపానికి వస్తాడు .దుర్యోధనుడు పైకి వచ్చి భీముడితో గదా యుద్ధం చేస్తాడు .ధర్మ రాజు గూఢచారి భీముడి చేతిలో దుర్యోధనుడు చనిపోయినట్లు చెబుతాడు .అందరూ సంతోషిస్తారు. ధర్మ రాజుకు పట్టాభిషేకం ద్రౌపదికి వేణీ సంహారోత్సవానికి సర్వం సిద్ధ చేస్తారు .ఇంతలో దుర్యోధనుడి రాక్షస స్నేహితుడొకడు చార్వాక ముని వేషం లో వచ్చి ద్వంద్వ యుద్ధం లో భీముడు నిహతుడైనట్లు వార్త చెపుతాడు .ఇది వరకు తానూ చేసిన ప్రతిజ్ఞా ప్రకారం ధర్మ రాజు మరణ ప్రయత్నం చేస్తాడు .ఈలోగా ఒళ్ళంతా రక్త ప్రవాహం తో తడిసి అలసిన  భీకర రూపం లో భీముడు  రంగ ప్రవేశం చేస్తాడు .అతడే దుర్యోధనుడు అనుకోని యుదిస్థిరుడు యుద్ధం చేయటానికి సిద్ధమవుతాడు .కాసేపటికి రక్తం ఓడుతున్నవాడు దుర్యోధనుడిని చంపిన భీముడుగా అందరూ గుర్తిస్తారు .భీముడు  దుశ్శాసన రక్తం తో నిండిన చేతులతో ద్రౌపదీ దేవి వేణి కి పూసి కురులను ముడిచి వేణీ సంహారం చేస్తాడు ,శ్రీకృష్ణుడు వచ్చి భరత వాక్యం పలుకుతాడు .




నాటకం లో హాస్యం పండించే విదూషక పాత్ర లేకుండా రాశాడు భట్టు .కాల వస్తు ,సమయ నటన ఐక్యతలు లేవని పాశ్చాత్య విమర్శకులు విల్సన్ ,బారువాలు ఎత్తి చూపారు .దుర్యోధనుడు భానుమతితో సరసాలు  ఆడుతుంటే ద్వారపాలకుడు ఒక్కసారిగా ప్రవేశించి ‘’భగ్నం భగ్నం ‘’అని అరుస్తాడు .అంటే ఆ గది బయట దుర్యోధనుడి రాజధ్వజం పెనుగాలికి విరిగి ఊడి పడిందని అర్ధం .ఈ సన్నివేశ కల్పనా అతనికి జరుగ బోయే కీడుకు సంకేతం గా కవి చెప్పించాడు .నాటక ప్రస్తావనలో  ధార్తరాస్త్రులు’’ అనే శబ్దాన్ని  హంసలకు,కౌరవులకు చక్కగా అన్వయించే గొప్ప శ్లోకం  చెప్పాడు .



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!