పోతనగారి పద్యం బాపు చిత్రం..౧౨

పోతనగారి పద్యం బాపు చిత్రం.

లఘు పద్యం కానీ ......నాలుకకి క్లిష్టం..

.

గజేంద్ర మోక్షణం

.

అడిగెదనని కడు వడిఁ జను-

నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్

వెడవెడ చిడిముడి తడఁ బడ 

నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

గజేంద్ర మోక్షణ ఘట్టం.

భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు. లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు. ఇది 'సర్వలఘు కంద పద్యం'.

.

`ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది.

పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!