హాస్య బ్రహ్మ జంధ్యాల...... K. విశ్వనాథ్ ..గార్ల ...... శంకర శాస్త్రి గారు.

హాస్య బ్రహ్మ జంధ్యాల...... K. విశ్వనాథ్ ..గార్ల ...... శంకర శాస్త్రి గారు.
.
“ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని ఒకలా అంటాడు, ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్ధుష్టమైన నాదం ఉంది. ప్రయోగాల పేరిట ఆ అమృత తుల్యమైన సంగీతం అపభ్రంశము చేయకు దాసూ”
శంకర శాస్త్రి, దాసు తో అన్న ఈ మాటలలో శంకర శాస్త్రి గుండెల్లో బాధ,సంగీతం మీద అతనికున్న అభిమానం , గౌరవం స్పష్టంగా అర్ధమవుతుంది.
.
శంకర శాస్త్రి గారి కూతురికి ఆయన బాల్య మిత్రుడు మాధవుడు పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. అనేక సంబంధాలు శాస్తిగారికి నచ్చక పోవడం మాధవ్ కి విసుగు పుట్టిస్తుంటుంది. చివరికి ఒక స్కూల్ టీచర్ సంబంధం శాస్త్రి గారికి ఆమోద యోగ్యం గా అనిపిస్తుంది. కానీ పెళ్లి చూపులప్పుడు శారద (శాస్త్రి గారి అమ్మాయి) పాట పాడుతూ ఒక చోట శృతి తప్పుతుంది. శాస్త్రి గార్కి కోపం వస్తుంది, ఆ తరువాత పెళ్ళికొడుకు అమ్మాయిని సమర్ధించ బోయి తొందరపాటు తో కంగారులో శాస్త్రి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పోతాడు. సంగీత జ్ఙానము లేనివాడికి పిల్లనివ్వనంటూ, సంబంధం వద్దంటాడు శాస్త్రి గారు.
.
మాధవ్ మాటల్లో తన ఆవేదన, ఆక్రోశం, కోపం ఎలా పలికించారో జంధ్యాల గమనించండి.
.
“అవసరం లేదురా నీకేదీఅవసరం లేదు, కానీ శారదకు పెళ్లి అవసరం, ఒక పెళ్లి తోడు అవసరం, ఒక నీడ అవసరం, ఏ సంగీత విద్వాంసుడికో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా , నువ్వు అనుభవించే సుఖం చాలకనా, సంగీత సామ్రాట్టువి, శంకరాభరణం లో దిట్టవి, గండపెండేరము తొడిగించుకున్నవాడివి, ఈ వేళ ఎవడన్నా కచేరికి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడురా, శుభ్రమైన బట్ట కట్టి ఎన్నాళ్లైయిందిరా, సంతృప్తిగా మూడు పూటలు భోంచేసి ఎన్నాళ్లైయిందిరా ,పోనీ శారదకన్నా ఒక రవికలగుడ్డ అయినా కొనిపెట్ట గలుగుతున్నావా, ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడ సేవ, ప్రజలకి నీ సంగీతం అఖ్ఖర్లేనప్పుడు ఆ సంగీతం నీకు కూడు గుడ్డ పెట్టలేనప్పుడు ఎందుకురా నీ కింకా ఆ వ్యామోహం?...... “
.
ఈ మాటలు పట్టు విడవని శంకర శాస్త్రి ని ఉద్దేశించినవి మాత్రమే కాదు, ఎరువు తెచ్చుకున్న పాశ్చాత్య వ్యామోహం లో పుట్టిన గడ్డ లోని సంస్కృతిని సాంప్రదాయాలని పట్టించుకోని, తమ ఉనికి కి కారణమైన కళలను, కళాకారులను గుర్తించలేని నేటి తరం యువతను కూడా ఉద్దేశించినదే. ఈ మాటలలో ఆగ్రహం, ఆవేదన, భంగపాటు, సమాజానికి ఒక నిఘూడమైన హెచ్చెరిక కనిపిస్తాయి. ఒక సందేశం వినిపిస్తాయి. ఒక రచయిత చిన్న ఘర్షణ సన్నివేశంలో, తమ మూలాలు మర్చిపోతున్న యువ తరం మీద తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ కూడా, సన్నివేశం లో ఔచిత్య భంగం కలుగ కుండా, ఉద్దేశించిన సందేశం వినిపించడం లో కృతకృత్యుడయితే, సమాజం మీద తన వ్యాఖ్యానం సినిమా లో జోడించగలిగితే, ముఖ్యం గా దర్శకుడి ముద్ర వేసుకున్న సినిమాలో, అది రచయిత ప్రతిభకి దర్పణం పట్టుతుంది.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!