ఉపపాండవులెందరు?

ఉపపాండవులెందరు?


ఈ ప్రశ్నకు సమాధానం, భారతం..ఆది.పర్వం…అశ్వాసం 4….115


“ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి, నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు. వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.”


1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,

2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు

3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి

4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు

5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు 


6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు.

7.భీముడు+జలంధర=సర్వగుడు

8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు

9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు.

10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.

11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు.


వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు. పాంచాలి వలన కలిగిన వారు కాక, మిగిలినవారంతా యుద్ధం లో మరణించారు. ఉపపాండవులలో మిగిలిన, పాంచాలి పుత్రులు ఐదిగురిని పాండవులుగా భ్రమించి, అశ్వద్ధామ నిదరపోతుండగా చంపేశాడు. ఇదీ ఉపపాండవుల చరిత్ర. ఇక అభిమన్యునికి ఉత్తర కు జన్మించినవాడు పరీక్షిత్తు.


వీరుకాక అర్జునునికి ఉలూపి, చిత్రాంగద అనే ఇద్దరు భార్యలున్నారు. ఇందులో చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుడు, ఇతను మణి పురాజ్యాధిపతి, తాత గారి రాజ్యానికి వారసుడయ్యాడు, అందుకు ఉప పాండవులలో చేర్చలేదు. ఇతను భారత యుద్ధం తరవాత బతికి ఉన్నవాడు. ఇతను యుద్ధం లో పాల్గొనలేనట్టే ఉంది,.


శ్రీ చిర్రావూరి భాస్కర శర్మ గారి బ్లాగు నుండి

Comments

  1. ఎన్నాళ్ళ నుండో ఉన్న సందేహాలు తీరాయి.

    ReplyDelete
  2. కురుక్షేత్రం తర్వాత బ్రతికి ఉన్నవారిలో యౌధేయుడు కూడా ఒకడు. అయితే అతను కూడా బభ్రువహనుడి లాగే తాతగారి రాజ్యానికి వారసుడిగా దౌహిత్రునిగా ధర్మరాజు వివాహానికి పూర్వమే అంగీకరించడం వలన యుద్ధంలో పాల్గొనకుండా తాతగారి రాజ్యం లోనే ఉండిపోయాడు. అందువలననే అతను ధర్మరాజు తర్వాత కూడా హస్తినాపురానికి రాజు కాలేదు.

    ReplyDelete
  3. నాగకన్య ఉలూపి (ఉలూచి) అర్జునుల కుమారుడు ఇరావంతుడు. ఇతను కూడా మహాభారత యుద్ధంలో మరణించాడు.

    ReplyDelete
    Replies
    1. ఓ విధంగా కురుక్షేత్ర యుద్ధం చాలా మంది క్షత్రియులను పొట్టన బెట్టుకుంది. కాని అందులో గల మర్మమేమంటే.. ధర్మానిదే విజయం.. అన్నాదమ్ముల నడుమ వైరం ఎంతటి ఘోరానికైనా ఉసిగొల్పగలదనే నీతి ఇందులోనే ఇంప్లిసిట్ గా బోధపడేటటువంటి విషయం.

      Delete
    2. ఐతే నాదోక సందేహం.. ఆ కాలంలో వీరులందరికి అమ్మాయిలే పుట్టలేదా..? లేదా.. ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..

      Delete
    3. మీ సందేహం సబబైనదే, శ్రీధరా 🙂.

      // “ ఆయా వీరాంగనాలు తరవాతి కాలం లో ఓ రుద్రమ, ఓ మణికర్ణికలుగా అవతరించారేమో..” // పోనీ అలానే అనుకున్నా కూడా అసలు వాళ్ళ జన్మ గురించిన ప్రసక్తి అంటూ ఉండాలిగా?

      Delete
    4. నేనా కోణం లో అడగలే దాచార్య.. అనంటే.. /*ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
      2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
      3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
      4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
      5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు */ లలో కేవలం పుత్రులనే ఊటంకించారు తదా శర్మాచార్య వారు.. మరి వారికి ఆడ సంతానం లేదా.. లేదా ఆ కాలం నుంఢే ఈ నాటి "బేటి బచావో" ఆందోళన్ లేదా..! డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ కం జెనెటిక్ ఇంజినియరింగ్ ఆ కాలం లోనే ఉండిందా.. ఆ లెక్కన చూస్తే కురుక్షేత్ర కాలం కంటే మునుపే భారతావనినా సైంటిఫిక్ బూముండే దన్నమాట..!

      Delete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!