శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట.

శ్రీమద్భాగవతం లోని దశమస్కందంలో పోతనగారి పద్యం.


శ్రీకృష్ణుడు గోపబాలురతో చల్దులారగించుట.


సీ. మాటిమాటికి వ్రేలుమడచి యూరించుచు నూరుగాయలు నుచుండునోక్క 

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి “చూడు లే” దని నోరు సూపు నొక్క 

డేగు రార్గుర చల్దు లెలిమి బన్నిద మాది కూర్కొని కూర్కొని కుడుచు నొక్క 

డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడు నొకడు


ఆ. కృష్ణు జూడు మనుచు గికురించి పలు మ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు

నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు, మురియునొకడు. 


భావం:


వ్రేళ్ళమధ్యలో ఊరుగాయ ముక్కలు ఇరికించుకొని మాటి మాటికి ప్రక్కవాడిని ఊరిస్తూ తింటున్నా డొక గోపబాలుడు. మరొకడు ప్రక్కవాని కంచంలోనిది గభాలున లాక్కొని మ్రింగివేసి, వాడు చూడవచ్చేసరికి “ఏదీ ఏమీ లేదే” అని తన నోరు చూపించాడు. మరొకడు పందెం వేసి, అయిదారుమంది తినే చల్దిని నోట కూరుకొని కూరుకొని తింటున్నాడు.”ఒరే ఇన్ని పదార్ధాలున్నాయి, స్నేహమంటే ఒకరిదొకరికి పంచి ఇవ్వాలట్రా !” అంటూ ఒక్కక్కరి కంచంలోనిది ఒక్కక్కటి తీసుకుంటూ ‘బంతెన గుండ్లు’ అనే ఆట ఆడుతున్నాడు మరొకడు.


“ఒరే కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడో చూడు!”అంటూ మాయచేసి, మిత్రుని ముందున్న మధురపదార్ధాలు తినేస్తున్నాడు వేరొకడు. ఒకడు నవ్వుతున్నాడు. మరొకడు తాను నవ్వకుండా ప్రక్కవారిని నవ్విస్తున్నాడు. ఇంకొకడు ముచ్చటలు చెబుతున్నాడు. వేరొకడు అవివింటూ మురిసిపోతున్నాడు.


నా మాట:


ఈ పద్యంలో పోతనగారు శ్రీకృష్ణుడు తన స్నేహితులతో ఉరగాయ ముక్కలు నంజుకుంటూ, ఒకరి కంచాలలోనిది ఒకరు లాక్కుంటూ, ఒకరు తెచ్చినది ఒకరికి పంచుకుంటూ, నవ్వుకుంటూ, నవ్వించుకుంటూ చల్డులారగించడం కళ్ళకి కట్టినట్లు చూపించారు....

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!