సావిత్రి అంటే ....

సావిత్రి అంటే మృదుమధుర వాక్కుల మేలైన మధుపంబు మేళవింపు, 

సావిత్రి అంటే రమణీయ రాజహంస నాట్యమయూరి నడకల రాణింపు,

సావిత్రి అంటే వీనులవిందైన వసంత కోకిల వనవిహార సంగీత చాటింపు, 

సావిత్రి అంటే కమనీయ కరుణారస కళా కావ్య కధా కోమల చిగురింపు!! 

మరులుగొల్పు మలయ మారుత మత్తేభ మందగమన మాధుర్య మధుశాల సావిత్రి, 

సొంపైన సొగసు సోయగాలు నింపి సుగంధ సౌరభాలు వెదజల్లు సుందరాంగి సావిత్రి, 

నిండుదనమే నిచ్చెనగా,హుందాతనమే హొయలుగా రంజింపు రసమయే సావిత్రి, 

గహన గాంభీర్య సన్నివేశ సమాహారంబున అలవోక సజీవ ప్రదర్శనమే సావిత్రి !!

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.