🌹గుర్తుకు వచ్చిన -జంధ్యాల మచ్చుతునకలు🌹

🌹గుర్తుకు వచ్చిన -జంధ్యాల మచ్చుతునకలు🌹


😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂


భర్త భార్యను ప్రేమించే పద్ధతికి, భార్య భర్తను వేదించే పద్ధతికి


సరైన నిర్వచనం :-


పెళ్ళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క - ఆ క్షణం నుంచి అదే ఆడది


అల్లంచెక్క, -నీ పీకనొక్క!


🤔😃🤔


మొక్కుబడికి బుక్కులన్నీ చదివినా కుక్కగొడుగు మొక్కలా,


చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా, కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా,


బిక్క మొహం వేసుకొని, వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ


చుక్కలు లెక్క పెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ,


ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ


నక్కపీనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా,


చిక్కు జుట్టు వేసుకొని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ,


పెళ్ళాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ, రెక్కలు తెగిన


అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్క బల్ల మీద బక్క చిక్కి


ఇలా పడుకోకపోతే --- ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్దీ తిరిగి,


నీ డొక్క శుద్ధితో వాళ్ళని ఢక్కాముక్కీలు తినిపించి, నీలక్కు పరీక్షించుకుని


ఒక్క చక్కని ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చక్కటి అడ్వాన్సు చెక్కు, చెక్కు


చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి.


🤔😃🤔.🤔😃🤔🤔😃🤔


శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన


మహామంత్రికి "అప్పాజీ" అని పేరు పెట్టుకున్నాడంటే.... అప్పు ఎంత


విలువైనదో గ్రహించండి.


ఇంగ్లీషులో కూడా "డౌన్" కంతే "అప్" ఉన్నతమైనది కాదా?


🤔😃🤔.


డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.


.🤔😃🤔


కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం…

.

గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర


🤔😃🤔🙏🙏🙏🙏🙏🙏🤔😃🤔


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!