🌹శృంగార వైషథంలో విద్యుద్దీపాల సౌరులు 🌹

🌹శృంగార వైషథంలో విద్యుద్దీపాల సౌరులు 🌹


(కీర్తి శేషులు శ్రీ వాకాటి పాండురంగారావు గారు నాకు చెప్పిన విశేషం. )


🏵️

శ్రీనాధుని శృంగార వైషథంలో అలాంటి దొకవిషయం ఉంది. 

మనం యిప్పుడు విద్యుత్ శక్తి ని వాడుకుంటున్నాం. 

దీవిని భారతీయులు18 శతాబ్దం వరకు యెరుగరు.

కానీ, శ్రీనాధకవి తనశృంగార నైషధంలో 7 వ ఆశ్వాసంలో, 

నలదమయంతుల రహఃకేళీ సమయంలో వర్ణించిన వర్ణనలు,

విద్యుద్దీపాల సౌరులను వెలయించాయి. వినండి ఆపద్యం!

👉

.

సీ: ఒక దీప మార్పిన నున్నదీపంబులు

నప్పుడ తమకు దామారుటయును;

తాల వృంతా నిల చేలాంచెలాదిక

వ్యాపారముల దీప మారుటయును;

నాఱిన దీపంబు లప్రయత్నంబున

మఱిఁజూడ జూడంగ మండుటయును;

మండి యాఱియు నాఱి మండిన దీపంబు

వెలుగుఁ జీకటియు గావించుటయును;

.

తే: కలుగు నట్లుగ పరశక్తి కలన రాజు / 

శిల్పముల నవ్వుటాలకుఁజేయు చుండ 

తరుణి కుతుక త్రపాద్భుతాతంకభార,/ 

సంకట స్థాయియై హరిణాంకయయ్యె

.

అది నలదమయంతులకు ప్రథమ సమాగమసమయం.

అంతవరకూలేని సిగ్గు ఆమెకు ముంచుకొని వచ్చింది నలుడుచుంబనమాసించి ముందుకేగ నామె చేతులతో నడ్డుచున్నది. రేయంతయు నట్లే నడచు నట్లు దోచినది. 

నలుడింక నామెను తనవైపుకు ద్రిప్పుటకు ప్రయత్నింప సాగెను.

చిత్ర విచిత్రములైన తన విద్యలను ఆమెముందు ప్రదర్శింప సాగెను. అందిది యొకటి.

.

మంచాల సమీపంలోఉన్న శిల్పాల చేతులలోని దీపాలతో నాట నారంభించాడు.

ఒకదీపాన్ని ఆర్పితే, అన్నిదీపాలూ ఆరిపోతున్నాయట! 

వెలిగేటప్పుడు మాత్రం గాలికి దీపాలేమాత్రం ఆరిపోవటం లేదట!

ఆరిన దీపాలన్నీ మళ్ళీతమంత తామే వెలుగుతున్నాయట. 

అలా లెలుగుతూ , ఆరుతూన్న ఆదీపాలు ఆగదిలో చీకటి వెలుగుల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాయట., ఇది యెంతవిచిత్రం!!!

.

1400--1410 ప్రాంతాలలో నైషథరచన జరిగినట్టు సమాచారం.

ఆతరువాత నాల్గుశతాబ్దులకుగానీ కరెంటే లేతాయె! 

మరియేవిటి యీశ్రీనాథమహాకవి యూహ?_ 

బహుశః అలాఉంటే బాగుంటుందనుకున్నాడేమో?

_ ఆవిధంగా ఆఘట్టాన్ని చిత్రించాడు. 

చూశారా మన మహా కవుల భవిష్యద్దర్శనం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!