🚩నండూరి వారు “ఎంకి”కి 100 ఏండ్లు .🙏🏿🌹🌹

🚩నండూరి వారు “ఎంకి”కి 100 ఏండ్లు .🙏🏿🌹🌹


💥💥💥💥💥💥💥💥💥💥💥💥


👉🏿నండూరి వెంకట సుబ్బారావు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజులలో, 1917-1918 ప్రాంతంలో ఈ పాటలు వ్రాయసాగారు. ఒకసారి ఆయన ట్రాం బండిలో ఇంటికి వెళుతుండగా "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి రూపు దిద్దుకొన్నదట. ఆ పాట విని మిత్రులు ప్రోత్సహించారు. క్రమంగా "ఎంకి పాటలు" (యెంకి పాటలు) రూపు దిద్దుకొన్నాయి.


🌹🌹


అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు


ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.


నిండు జవ్వని-నిండు యవ్వని


🌹🌹🌹🌹


👉

ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి


మెళ్ళో పూసల పేరు


తల్లో పువుల సేరు


కళ్ళెత్తితే సాలు:


రసోరింటికైనా


రంగు తెచ్చే పిల్ల.


పదమూ పాడిందంటె


కతలూ సెప్పిందంటె


కలకాలముండాలి.


అంసల్లె, బొమ్మల్లే


అందాల బరిణల్లే


సుక్కల్లె నా యెంకి


అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


🚩స్పందన!


యెంకిపాటలపై పాఠకులు, విమర్శకులు, పండితులు భిన్నమైన

అభిప్రాయాలు వెలిబుచ్చారు.


పంచాగ్నుల ఆదినారాయణ యెంకి, నాయుడు బావలను రతీ మన్మధులతో పోల్చారు.


వేదం వేంకటరాయ శాస్త్రి వారినే రంభా-నలకూబరులతో పోల్చారు.


ఈయన 1925లో నూజివీడులో జరిగిన కవి సమ్మేళనంలో


ఎంకిపాటలను షేక్స్పియర్ సానెట్స్‌తో పోల్చాడు.


పురాణం సూరిశాస్త్రి ఆ ప్రేమికులను జీవాత్మ-పరమాత్మలతో పోల్చారు.


పొక్కులూరి లక్ష్మీనారాయణ వారిని సంకర దంపతులని అధిక్షేపించారు.


👉🏿ఇంకా వ్యావహారిక భాష బహుళంగా రచనలలో వాడకముందే


పల్లె ప్రేమికుల గురించి "తూర్పు కాపు యాస"లో పాటలు వ్రాసిన


సాహసి నండూరి సుబ్బారావు


ముద్దుకృష్ణ రచించిన "వైతాళికులు" కవితా సంకలనంలో


ఇలా చెప్పబడింది - "శ్రీ నండూరి వారు తమకు సాక్షాత్కరించిన


కవితను అందుకోవడంలో బంధాలను తెంచివేశారు.


నియమాలను తోసిపారవేశారు. భావంలో, బాషలో అన్నిటా


"ఎర్రబావుటా" ఎగురవేశారు.


‘ఏడ నీ కాపురమే ఎలుతురు పిల్లా!’ అని అడిగాడు నాయుడు.


‘నీ నీడలోనె మేడకడత నాయుడుబావ!’ అని గడుసుగా బదులిచ్చింది- ఎంకి.


ఆ చిలిపిదనాన్ని ఆస్వాదించడం శృంగారానుభవం! ‘కళ్లెత్తితేసాలు,


కనకాబిసేకాలు ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌’ అని మురిసిపోతూ,


‘నా గుండెను ఎంకి నమిలి మింగేసింది’ అన్నాడు నాయుడు.


1917లో మద్రాస్‌ ట్రాం బండిలో ప్రయాణిస్తున్న నండూరి


వెంకటసుబ్బారావు గుండెల్లోంచి ఉద్భవించిన అద్భుత జంట- ఇప్పుడు


శతవార్షికోత్సవ సంబరాల్లో మునిగి తేలుతోంది.


‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ


నీదురా కూసింతసేపు’ అంటూ ప్రసవవేదనతో సతమతమైన


నండూరి ఈ చిరంజీవులకు భద్రంగా జన్మనిచ్చారు.


‘రాసోరింటికైనా రంగు దెచ్చే పిల్ల’ నేరుగా నాయుడి గుండెల్లో కాపురం


పెట్టింది. ‘వెన్నెలంతా మేసి ఏరు నెమరేసింది, ఎన్నెలలో సొగసంత


ఏటి పాలేనటరా!’ అంటూ మర్మంగా రెచ్చగొట్టింది.


‘గాలికైనా తాను కవుగిలి ఈనన్నాడు’ అన్నంత నమ్మకాన్నిచ్చాడు


నాయుడు. భాషలో భావంలో ముతకదనం, మనుషుల్లో మొరటుదనం


ముదిరిపోని రోజుల్లో పుట్టారు కనుక- నూరేళ్లుగా రతీమన్మథుల్లా


విహరిస్తున్నారు. ఈ మాట వేదం వెంకటరాయశాస్త్రి, పంచాగ్నుల


ఆదినారాయణశాస్త్రి వంటివారు అన్నారు. వారిద్దరి ముచ్చటైన


దాంపత్య భోగాన్ని సినారె ‘మాంజిష్ఠారాగం’గా పేర్కొన్నారు.


వారి అన్యోన్యం మనకు ఆనందాన్నిస్తోందో అసూయను కలిగిస్తోందో


గుండెల్లోకి తొంగి చూసుకుంటే తెలుస్తుంది.


మరో వెయ్యేళ్లు వారిని అలాగే ఉండమని మనసారా దీవించాలనిపిస్తోంది!"


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!