ఆది శంకరాచార్య భజగోవిందం ! (11o207)

ఆది శంకరాచార్య భజగోవిందం !

(11o207)

.

శ్లోకం - 1

భజగోవిన్దం భజగోవిన్దం 

గోవిన్దం భజమూఢమతే|

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే||

.

శ్లోకం అర్ధం : గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు.

ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

.

తాత్పర్యము :

పరమాత్మ స్వరూపా! ఓ బుద్ధిమతీ! ప్రాపంచిక విషయ వాసనా జాలములో పడి భగవంతుని విస్మరించకుము.

మనకున్న ధన, ధాన్యాది సంపదలు, పదవులు, భౌతిక విద్యలు, నైపుణ్యాలు, అంత్య కాలములో, మనలను రక్షింపలేవు,

అవసాన దశలో మనలను ఆదుకొనేది, శ్రీహరి ధ్యానము ఒక్కటే. కనుక శ్రీహరిని స్మరింపుము, 

ఏ మాత్రము ఆలస్యము చేయకుము. చివరి క్షణముల వరకు వేచిన, ఆ చివరి దశలో మనకు హరి నామకీర్తన అవకాశము దొరకునో లేదో తెలియదు.

పొట్టకూటికి పనికి వచ్చే ఈ విద్య లేవియు, చివరి దశలో మనకు అక్కరకు రావు, మనలను రక్షింపలేవు.

కనుక తక్షణమే హరి నామస్మరణ ప్రారంభించుము. 

హరి నామస్మరణకు ఒక సమయము, పధ్ధతి, నియమాలేవియు లేవు. సర్వకాల, సర్వావస్థలయందు భజింప దగినది హరి నామం. 

ప్రతి క్షణము, ఏ పనిలో ఉన్నను శ్రీహరి స్మరణను మరువకుము. కాలుని జాలము నుండి అదే నిన్ను కాపాడగలదు. ఈ కాయము విడనాడు సమయమున, మరణాన్ని సుఖమయము, నిర్భయము చేసి, సంతోషముగా ఈ శరీరాన్ని విసర్జింప జేసి, శ్రీహరి సన్నిధిని చేర్చగలిగిన ఆ శుభ నామాన్ని నిరతము ధ్యానింపుము. తినుచున్నా, త్రాగుచున్నా, పనిలో ఉన్నా, నిదురించు చున్నా, క్రీడించు చున్నా మనసున హరి ధ్యానమును మరువకుడు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.